వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ (Jagan)..ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే శుక్రవారం అమలాపురం సభ (Amalapuram Public Meeting)లో ఈయన అలాగే మాట్లాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్‌ఆర్ సున్నావడ్డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,05,13,365 మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో సున్నావడ్డీ నగదు రూ.1,354 కోట్లను జమ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ముగ్గురు ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలరని హెచ్చరించారని జగన్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారన్నారు. ఏకంగా నరకాన్ని చూపిస్తామంటున్నరని వాయిస్ మార్చి వేరియేషన్ చూపించి మరీ ప్రసంగించారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని.. అందుకే అధికారం ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ తాను అన్న మాటలు కాదని.. చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడు అన్నమాటలని పేర్కొన్నాడు.
ఈ మాటలు విన్న జనాలు మరో విధంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జగన్ లో ఓటమి భయం మొదలైందని అందుకే ఇలా ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ (Emotional blackmail) చేయడం చేస్తున్నాడని వారంతా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇలాగే వైస్సార్ పేరు చెప్పి..ప్రజలను మోసం చేసి , అధికారంలో వచ్చాడని, సీఎం కుర్చీ ఎక్కగానే తన నిజ స్వరూపం చూపించాడని , సంక్షేమ పధకాల పేరు చెప్పి, ప్రజల నడ్డి విరగ్గొడుతున్నాడని, ప్రతి దానిపై పన్ను విదిస్తున్నాడని , ఆఖరికి చెత్త ఫై కూడా చెత్త పన్ను విసి చెత్త సీఎం అనిపించుకున్నాడని ప్రతిపక్షాలు , ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు 175 కి 175 అని చెప్పుకుంటూ వచ్చిన జగన్…ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమై అయ్యాయని చెపుతూ ముసలి కన్నీరు కరుస్తున్నాడని అంటున్నారు.
తాను ప్రతిపక్షాలను చేసిన వేధింపులకు అధికారం కోల్పోతే.. తనకు నిలువ నీడ కూడా ఉండదన్న భయానికి ఆయన వస్తున్నారని భావిస్తున్నారు. ఇలాగే ఎమోషనల్ ఏడుపును ముందు ముందు మరింత ఎక్కువగా ప్రజల ముందు వినిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సారి ఓడిపోతే తనను చంపేస్తారని.. దయచేసి గెలిపించాడని ఆయన సెంటిమెంట్ ప్రయోగించే ప్లాన్ ఐ ప్యాక్ రెడీ చేసిందని అంటున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి తన పాలనపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. చేసిన తప్పులకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో.. ప్రజల ముందుకు ఏడుపు మొహంతో వచ్చేందుకు మొదటి అడుగు అమలాపురంలో వేశారని అంటున్నారు. చూద్దాం జగన్ ఇలాగే సెంటిమెంట్ కొనసాగిస్తాడా..? గెలుపు ఫై ధీమాగా ఉంటాడా అనేది.
Read Also : SKN : మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగితే తట్టుకోలేరు..వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన బేబీ నిర్మాత