వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) తన స్పీడ్ ను ఇంకాస్త పెంచబోతున్నాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలవడంతో తన వ్యూహాన్ని మార్చేపనిలో పడ్డారు. ఇప్పటికే సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రజలపై కొత్త వరాల ప్రకటించబోతున్నారు. నిన్నటి వరకు సిద్ధం అంటూ వారంలో ఓ సారి ప్రజల్లోకి వెళ్లిన జగన్..ఇక ఈ నెల 16 నుండి పూర్తిగా ప్రతి రోజు ప్రజల ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈనెల 16 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం (Jagan Election Campaign) ప్రారభించబోతున్నారు. 26 జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. చివరి దశ ప్రచారంలో భాగంగా ఆయన రోజుకు 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని సమాచారం. దీనికి సంబదించిన పూర్తి షెడ్యూల్ ను సిద్ధం చేసే పనిలో అధిష్టానం ఉంది. ఇదిలా ఉంటె ఈ నెల 11 న వైయస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.
సోమవారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైయస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభిస్తారు. తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైయస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైయస్ఆర్ జంక్షన్‌కు చేరుకుని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైయస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైయస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. వైయస్ఆర్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైయస్ఆర్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
Read Also : AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!