Site icon HashtagU Telugu

Jagan Effect : ఉద్యోగుల ఉద్య‌మం స‌డ‌లింపు, ధ‌ర్నాలు ర‌ద్దు

Jagan Effect

Ap Employees

ఏపీలోని అమరావ‌తి జేఏసీ (Jagan Effect)ఉద్య‌మాన్ని స‌డ‌లించింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌రపును మంత్రులు ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర్నాల‌ను ర‌ద్దు చేసుకుంది. ప్ర‌తి రోజూ గురువారం నుంచి లంచ్ అవ‌ర్లో చేయాల్సిన ధ‌ర్నాలు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించింది. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చేసిన అవ‌మానాల‌ను కూడా ఏపీ జేఏసీ(JAC amravathi) భ‌రించింది. ప‌ట్ట‌భద్రులు, ఉపాధ్యాయ ఎన్నిక‌ల దృష్ట్యా జ‌గ‌న్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో జేఏసీ ప‌డిపోయింది. కేవ‌లం రెండు హామీలకు పాక్షికంగా ఆమోదం తెల‌ప‌డంతో ఉద్య‌మాన్ని జేఏసీ స‌డ‌లించింది. దీంతో ఉద్యోగుల నుంచి జేఏసీ నాయ‌కులు వ్య‌తిరేక‌త‌ను చ‌విచూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా ఎక్కుపెట్టిన `ఏసీబీ` అస్త్రానికి భ‌య‌ప‌డి ఉద్య‌మాన్ని వాయిదా వేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించార‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు.

మంత్రులు ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర్నాల‌  ర‌ద్దు(Jagan Effect)

మ‌లి ద‌శ ఉద్య‌మాన్ని వ‌చ్చే నెల 5వ తేదీని ప్ర‌క‌టించాల‌ని జేఏసీ(JAC amaravathi) నిర్థారించుకుంది. మొద‌టి ద‌శ ఉద్య‌మాన్ని స‌డ‌లించిన త‌రువాత మ‌లి ద‌శ గురించి లీడ‌ర్లు మాట్లాడ‌డం గ‌మ‌నార్హం. ఆర్థిక‌ప‌ర‌మైన రెండు అంశాల‌ను మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఇచ్చిన మినిట్స్ లో (Jagan Effect)ఉంది. దాని ప్ర‌కారం నెలాఖ‌రు నాటికి రూ. 3వేల కోట్లు బ‌కాయిలు చెల్లింపులు ఉంటాయి. ఈనెల 16వ తేదీన హెల్త్ కార్డులు, బ‌కాయిల మీద హామీ చీఫ్ సెక్ర‌ట‌రీ ఇస్తారు. ఈ రెండు అంశాల‌ను బేస్ చేసుకుని లంచ్ టైమ్ లో గురువారం నుంచి చేయాల్సిన ధ‌ర్నాల‌ను ఎత్తివేయ‌డం జ‌రిగింది.

ఏప్రిల్ 5వ తేదీన స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకుని  

ఈనెల 17, 20 తేదీల్లో జేఏసీ లీడ‌ర్లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోని ఉద్యోగుల‌ను క‌లుస్తారు. వ‌చ్చే నెల 5వ తేదీ వ‌ర‌కు ఇప్ప‌టి నుంచి న‌ల్ల బ్యాడ్జిల‌తో ఉద్యోగులు విధులను నిర్వ‌హిస్తారు. ఈనెల 21వ తేదీ నుంచి వ‌ర్క్ టూ రూల్‌, 27న కారుణ్య నియామ‌కాల కుటుంబీకుల్ని క‌లిసే కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 5వ తేదీన స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్ర‌భుత్వ హామీల మీద స‌మీక్షిస్తుంది. అప్పుడు మ‌లి ద‌శ ఉద్య‌మానికి ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని వెల్ల‌డించారు.

Also Read : AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

అమ‌రావ‌తి జేఏసీకి (JAC amaravathi)మిగిలిన సంఘాలు కూడా మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని బొప్ప‌రాజు కోర‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు జేఏసీ లీడ‌ర్ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఒక వైపు ఉద్యోగ సంఘాల నేత‌లు సూర్యానారాయ‌ణ‌, బండి శ్రీనివాస‌రావు మ‌ధ్య పోరు జరుగుతోంది. ఆస్తుల మీద విచార‌ణ చేయాల‌ని బండి కోరుతున్నారు. ఏపీ ఎన్డీవో సంఘాన్ని ర‌ద్దు చేయాల‌ని కూడా డిమాండ్ ఉంది. ఆ విష‌యం కోర్టులో విచార‌ణ‌కు సిద్ధంగా ఉంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య ఐక్యంగా ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఒక వేదిక‌పైకి వ‌స్తార‌ని(Jagan Effect) న‌మ్మ‌కం లేదు. పైగా ఉద్యోగ సంఘాలు నిట్ట‌నిలువునా చీలిపోవ‌డం అంద‌రికీ తెలిసిందే. తెలుగుదేశం, వైసీపీ ఉద్యోగ సంఘాలుగా క‌నిపిస్తున్నాయి. ఉద్య‌మం చేయాల‌ని టీడీపీ మ‌ద్ధ‌తు ఉన్న ఉద్యోగ సంఘాల నేత‌లు కోరుకుంటున్నారు. ఉద్య‌మాన్ని నీరుగార్చాల‌ని వైసీపీ మ‌ద్ధ‌తు ఉన్న సంఘాల లీడ‌ర్లు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తాం అంటూ బీరాలు ప‌లికిన ఉద్యోగ సంఘాల లీడ‌ర్లు ఇప్పుడు జ‌గ‌న్ దెబ్బ‌కు తోక‌లు ముడిచారు.

Also Read : Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!