CM Jagan : ఢిల్లీ వేదికగా పరువు పోగొట్టుకున్న సీఎం జగన్

పార్లమెంట్ వేదికగా ఏపీ సీఎం జగన్ పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం కేంద్రం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి భారతరత్న రావడం […]

Published By: HashtagU Telugu Desk
Jagan Pv

Jagan Pv

పార్లమెంట్ వేదికగా ఏపీ సీఎం జగన్ పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం కేంద్రం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి భారతరత్న రావడం పట్ల సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు స్పందిస్తూ వస్తుండగా..సీఎం జగన్ మాత్రం సాయిరెడ్డి ని అడగండి అంటూ పరువు పోగొట్టుకున్నాడు.

ప్రస్తుతం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఏపీకి రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధానిని కోరినట్లు సమాచారం. అయితే, ప్రధానితో భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం జగన్‌పై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం సంధించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి పీవీ నరసింహారావుకు భారతరత్న రావటం పట్ల మీ స్పందన ఏంటి..? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనికి సీఎం జగన్ స్పందిస్తూ.. విజయ సాయిరెడ్డి చెప్తాడు అని చెపుతూ ముందుకు వెళ్లాడు. వెంటనే సదరు విలేఖరి.. మీ రాష్ట్ర సీఎం కూడా సాయిరెడ్డేనా..? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక విజయసాయిరెడ్డిపైకి నెట్టివేసే సీఎంను ఎక్కడా చూడలేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇదేమి కుసంస్కారం జగన్? అంటూ మండిపడ్డారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భం అని లోకేశ్ పేర్కొన్నారు.

కానీ, దీనిపై స్పందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను జాతీయ మీడియా కోరితే ఆయన తప్పించుకున్న తీరు చాలా చాలా అవమానకరం అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వీడియోను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పంచుకున్నారు.

Read Also : CM Revanth : ఉద్యమ స్ఫూర్తిని సీఎం రేవంత్ కించపరుస్తున్నారు – హరీష్ రావు

  Last Updated: 09 Feb 2024, 08:44 PM IST