‘చంద్రబాబూ.. నిన్ను సీఎం చేసింది గాడిదలు కాయడానికా?’ అని జగన్ ఫైరయ్యారు. బుధువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్..రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిని కేవలం ప్రజలను మోసం చేసేందుకు, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేందుకే వినియోగిస్తున్నారని జగన్ ప్రధానంగా ఆరోపించారు.
Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేసారని..అందుకు ఆయనపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి” అని జగన్ వ్యాఖ్యానించారు. “ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా?” అని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా తల్లికి వందనం (ప్రతి ఇంటికీ రూ. 15,000), ఉచిత సిలిండర్లు వంటి ప్రధాన హామీలను చంద్రబాబు అధికారంలోకి రాగానే అమలు చేయకపోవడాన్ని జగన్ ఉదహరించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై కూడా ఎన్నో నిబంధనలు పెట్టి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఉచిత హామీల పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న టీడీపీ, ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చేతులెత్తేసిందని జగన్ విమర్శించారు.
SIP Investments : పదేళ్లలో రూ.కోటి కావాలా? నెలకు ఎంత సిప్ చేయాలో తెలుసా..!
హామీల అమలు విషయంలో మోసం చేయడంతో పాటు, తమ ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను నిలిపివేశారని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా నాడు-నేడు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడంపై, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విద్యా విధానాన్ని రద్దు చేయడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో తెచ్చిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా, చంద్రబాబు పరిపాలన వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, అన్ని వైపుల నుంచీ ప్రజలు మోసానికి గురవుతున్నారని జగన్ తన ప్రసంగంలో బలంగా పేర్కొన్నారు. మరి జగన్ వ్యాఖ్యలపై టిడిపి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.
