Gudivada Amarnath : జగన్ కోటరీ అంటే అది ప్రజలే: అమర్ నాథ్

విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. అది ప్రతీ వ్యవస్థలో భాగం.. మొన్నటి వరకు కోటరీలో వున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని ఫైర్‌ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Jagan coterie is the people: Amarnath

Jagan coterie is the people: Amarnath

Gudivada Amarnath : మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా మాట్లాడుతూ..వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని… ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించిన ఆయన.. మొన్నటి వరకు సాయిరెడ్డి చెప్పిన పూజారుల్లో ఆయన ఒకరు కదా ? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత వ్యవసాయం కాదు రాజకీయం చేస్తారనేది అర్థం అయ్యింది. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. అది ప్రతీ వ్యవస్థలో భాగం.. మొన్నటి వరకు కోటరీలో వున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని ఫైర్‌ అయ్యారు.

Read Also: Nara Lokesh : నారా లోకేష్ మాట ఇచ్చాడంటే తిరుగుండదు

మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే… ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు.. మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఇంత కంటే గొప్పగా మాట్లాడతారని భావించలేం అంటూ సాయిరెడ్డిపై సెటైర్లు వేశారు. రాజీనామా తర్వాత ఇక ఏ రాజకీయ పార్టీలో చేరనని చెప్పిన మాటలకు నిన్నటి వ్యాఖ్యలకు తేడా కనిపించిందన్నారు. 2024లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వుంటే ఇప్పుడు వెళ్లిపోయిన వాళ్లు.. ఎలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు.. ఈ విధంగా స్పందించే వాళ్లా..? అని నిలదీశారు.

విజయసాయి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా? అని అడిగారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అధికార, విపక్షలతో పాటు ప్రభుత్వ పక్షం అనే టీమ్ ఒకటి తిరుగుతోంది.. అటువంటి బ్యాచ్ లకు అధికారంలో ఉన్న వాళ్లు తప్ప రాజకీయాలతో సంబంధం ఉండన్నారు.. ఇక, కాకినాడ సీ పోర్టు పై ఎటువంటి విచారణ అయిన చేసుకోవచ్చు.. కానీ, వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు.

Read Also: Assembly : తప్పు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు : మంత్రి లోకేశ్‌

  Last Updated: 13 Mar 2025, 12:50 PM IST