Jagan : జ‌గ‌న్ పై సుప్రీం కోర్టులో `ధిక్క‌ర‌ణ` ఫిర్యాదు! వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌!!

స‌మాజానికి నాలుగు వ్య‌వ‌స్థ‌ల‌కు(Jagan) వేర్వేరుగా ప‌రిధిని, స్వేచ్ఛ‌ను,అధికారాల‌ను,

  • Written By:
  • Updated On - February 4, 2023 / 01:41 PM IST

శాస‌న‌(Jagan), నిర్వ‌హ‌ణ‌, న్యాయ‌, మీడియా స‌మాజానికి నాలుగు మూలస్తంభాలు. ఆ నాలుగు వ్య‌వ‌స్థ‌ల‌కు వేర్వేరుగా ప‌రిధిని, స్వేచ్ఛ‌ను, అధికారాల‌ను, బాధ్య‌త‌ల‌ను గుర్తు చేస్తూ రాజ్యాంగం పొందుప‌ర‌చ‌బ‌డింది. ఒక‌దాని మీదకు మ‌రొకటి రాకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతూ రాజ్యాంగాన్ని రచించారు. కానీ, ప్ర‌స్తుతం శాస‌న వ్య‌వ‌స్థ మిగిలిన వ్య‌వ‌స్థ‌లపై ఆధిప‌త్యాన్ని చెలాయించ‌డానికి త‌ర‌చూ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే, వివాదం నెల‌కొంటోంది. ప్ర‌త్యేకించి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏలుబ‌డిలో (Court)వ్య‌వ‌స్థ‌ల స్వేచ్ఛ కు భంగం క‌లుగుతోందని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న విమ‌ర్శ‌.

శాస‌న వ్య‌వ‌స్థ మిగిలిన వ్య‌వ‌స్థ‌లపై ఆధిప‌త్యాన్ని చెలాయించ‌డానికి త‌ర‌చూ..(Jagan)

న్యాయ స్థానాల‌ను(Court) గౌర‌వించే సంప్ర‌దాయాన్ని గ‌త ప్ర‌భుత్వాలు పాటించాయి. నిర్వ‌హ‌ణాధికారులు చ‌ట్ట ప‌రిధిలోనే ప‌నిచేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతూ వ‌స్తున్నారు. కానీ, ఇటీవ‌ల ఏపీలోని శాస‌న‌(Jagan), నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లు ప‌రిధిని దాటి ప‌లు సంద‌ర్భాల్లో వెళ్లాల‌య‌ని ఉన్న‌త‌ న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డుతోంది. అందుకే, సివిల్ స‌ర్వెంట్లు ప‌లుమార్లు కోర్టులో క‌నిపిస్తుంటే చికాకు క‌లుగుతోందని జ‌డ్జి కామెంట్ చేయ‌డం సీరియ‌స్ అంశం. ఏపీలో లా అండ్ ఆర్డ‌ర్ లేద‌ని గ‌త మూడేళ్లుగా జ‌డ్జిలు మొత్తుకుంటున్నారు. ఆ మేర‌కు అభిప్రాయాల‌ను తెలియ‌చేస్తూ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌లోని అధికారుల‌కు చెబుతూనే ఉన్నారు. కానీ, ఏ మాత్రం మార్పు లేదు. ఫ‌లితంగా డీజీపీ, ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ హోదాల్లోని సివిల్ స‌ర్వెంట్లు చేతులు క‌ట్టుకుని కోర్టుల్లో నిల‌బ‌డుతున్నారు. తాజాగా పంచాయ‌తీరాజ్ కార్య‌ద‌ర్శి క్ష‌మాప‌ణ‌లు కోరారు.

Also Read : Jagan IPS-IAS : ఇద్ద‌రూ ఇద్ద‌రే.! టీడీపీ లీడ‌ర్ల‌కు ద‌డ ! జ‌గ‌న్ కు క‌ళ్లూ, చెవులు!

సివిల్ స‌ర్వెంట్లు హైకోర్టుకు ఇటీవ‌ల త‌ర‌చూ హాజ‌ర‌వుతున్నారు. న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల‌ను ఏ మాత్రం అమ‌లు చేయ‌కుండా క్ష‌మాప‌ణ‌లు ప‌దేప‌దే కోరుతున్నారు. బ‌హుశా ఇలాంటి ప‌రిణామాన్ని గ‌మ‌నించి చికాకు వ‌స్తుంద‌ని జ‌డ్జి అభిప్రాయ‌ప‌డి ఉంటారు. రాజ్యాంగ ప్ర‌కారం న‌డుచుకోవాల్సిన ప్ర‌భుత్వంలోని పెద్ద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అతిక్ర‌మిస్తున్నారు. ఆ విష‌యాన్ని పొందుప‌రుస్తూ తాజాగా సీనియర్ న్యాయ‌వాది లక్ష్మీనారాయ‌ణ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

విశాఖ రాజ‌ధాని అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..

సుప్రీం కోర్టులో (Court)ఉన్న ఏపీ రాజ‌ధాని అంశాన్ని కాద‌ని విశాఖ రాజ‌ధాని అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు విశాఖలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆ విష‌యాన్ని పొందుప‌రుస్తూ రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా, విశాఖను రాజధాని అంటూ జగన్ ఎలా అంటారని లేఖ‌ పంపారు. న్యాయస్థాన ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 2(సీ)ను ఉల్లంఘించినట్టేనని తన లేఖలో న్యాయ‌వాది పేర్కొన్నారు. జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోర‌డం ఇప్పుడు సంచ‌ల‌నం కలిగిస్తోంది.

Also Read : Jagan : కోడిక‌త్తి కేసు కీల‌క మ‌లుపు! జ‌గ‌న్‌ హాజ‌రు కావాల‌ని ఎన్ఐఏ కోర్టు ఆదేశం!!

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప‌లు జీవోల‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. ప‌లు ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసింది. ప్ర‌త్యేకించి రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో న్యాయ‌స్థానం ప‌లు సంద‌ర్బాల్లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ తీర్పులు చెప్పింది. దీంతో జ‌డ్జిల మీద సోష‌ల్ మీడియా వేదికగా కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు విమ‌ర్శ‌లు చేశారు. వ్య‌క్తిగ‌తంగా దూషిస్తూ వైసీపీ క్యాడ‌ర్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దానిపై సీబీఐ విచార‌ణ చేయాల‌ని కోర్టు ఆదేశాలు ఉన్న స‌మ‌యంలోనే సుప్రీం కోర్టు చీఫ్ జ‌డ్జి కాబోతున్న ఎన్వీ ర‌మ‌ణకు వ్య‌తిరేకంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఆనాడు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డం పెద్ద దుమారాన్ని రేపింది. ఆ స్థాయిలో న్యాయ వ్య‌వ‌స్థ మీద తిర‌గ‌బ‌డిన ప్ర‌భుత్వం బ‌హుశా దేశం మొత్తం మీద జ‌గ‌న్ స‌ర్కార్ మాత్ర‌మే.

న్యాయ వ్య‌వ‌స్థ మీద శాస‌న వ్య‌వ‌స్థ పెత్త‌నం

ఏపీ రాజ‌ధాని అంశంపై హైకోర్టు(Court) ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది. దానిపై విచార‌ణ చేసిన ఉన్న‌త న్యాయ‌స్థానం కొన్ని అంశాల‌పై స్టే విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజ‌ధాని విష‌యంలో మాత్రం ఇంకా తీర్పు రాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీ రాజ‌ధాని విశాఖ అంటూ సీఎం హోదాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం న్యాయ వ్య‌వ‌స్థ మీద శాస‌న వ్య‌వ‌స్థ పెత్త‌నం చేస్తుంద‌న్న భావం క‌లిగిస్తోంది. అందుకే కోర్టు ధిక్క‌ర‌ణ కింద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విచారించాల‌ని న్యాయవాది ల‌క్ష్మీనారాయ‌ణ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. న్యాయ‌, శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఇలాంటి ప‌రిణామం కొత్త కాక‌పోయిన‌ప్ప‌టికీ మూడేళ్ల కాలంలో ప‌లు సంద‌ర్భాల్లో పొడ‌చూప‌డం శోచ‌నీయం.