Viveka Murder Case : వివేకా హత్య ఫై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

మా వివేక చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు..రాష్ట్ర ప్రజలకు తెలుసు

Published By: HashtagU Telugu Desk
Jagan Viveka Siddam

Jagan Viveka Siddam

ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రొద్దుటూరు (Proddatur ) లో జరిగిన మీమంతా సిద్ధం సభలో జగన్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి , తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే..ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో చర్చగా మారిన వివేకా హత్య (Viveka Murder Case) ఫై జగన్ (jagan) సభ వేదికపై స్పందించారు.

‘మా వివేక చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు..రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ తనపై బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను తీసుకొచ్చారని.. వారిని ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసన్నారు. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి ఈరోజు మద్దతు ఇస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా షర్మిల , సునీతలను విమర్శించారు. ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఒక్కడినైనా తనపై యుద్ధం చేసేందుకు వస్తున్నారు..కానీ ఈ ఒక్కడికి మీరంతా ఉన్నారని చెప్పుకొచ్చి ఆకట్టుకున్నారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు అని, నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికి కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు’ అని జగన్ మండిపడ్డారు.

అలాగే విశాఖ డ్రగ్స్ కేసుపై కూడా జగన్ స్పందించారు. ‘చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది. దీంతో టీడీపీ బ్యాచ్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి’ అని జగన్ ఆరోపించారు.

Read Also : AP BJP Assembly Candidates : ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

  Last Updated: 27 Mar 2024, 08:11 PM IST