CM Jagan : ‘సింహం సింగిల్‌గానే వస్తుంది.. తోడేళ్లన్నీ ఏకమైనా ఏమీ చేయలేరు’ – సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ (CM Jagan) మరోసారి రజనీకాంత్ (Rajanikanth) డైలాగ్స్ చెప్పి కార్యకర్తల్లో , పార్టీ నేతల్లో జోష్ నింపారు.

  • Written By:
  • Updated On - November 17, 2023 / 04:12 PM IST

ఏపీ సీఎం జగన్ (CM Jagan) మరోసారి రజనీకాంత్ (Rajanikanth) డైలాగ్స్ చెప్పి కార్యకర్తల్లో , పార్టీ నేతల్లో జోష్ నింపారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభ (Nuzvid Public Meeting)లో సీఎం జ‌గ‌న్‌ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ నాలుగున్నర ఏళ్లలో వైసీపీ (YCP) ప్రభుత్వం చేసిన అభివృద్ధి , తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ..టీడీపీ , జనసేన పార్టీ (TDP-Janasena)ల ఫై విమర్శలు చేసారు. రాబోయేది ఎన్నికల సంగ్రామం అని ..ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని జగన్‌ చెప్పుకొచ్చారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తామంటారు..కిలో బంగారం ఇస్తామంటారు.. అవి నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 4వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది…సర్వే పూర్తి అయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని…చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం…లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం అన్నారు.

Read Also : Congress Abhaya Hastham : జర్నలిస్టులఫై కాంగ్రెస్ వరాల జల్లు