Site icon HashtagU Telugu

Jagan Break : వారాహి, యువ‌గ‌ళం పై జ‌`గ‌న్‌`! ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..బ్రేకేనా?

Janasena-TDP

Babu Lokesh Pawan

రోడ్ షోలు, స‌భ‌ల‌ను నిషేధిస్తూ ఇచ్చిన జీవో వైసీపీకి (Jagan Break) కూడా వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. భ‌ద్ర‌త (security)క‌ల్పించ‌డానికి చేసి మార్గ‌ద‌ర్శ‌కాలు అంటూ ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న జీవోల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని సెల‌వు ఇచ్చారు. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలేద‌ని పరోక్షంగా ఆయ‌న అంగీక‌రించారు.

Also Read : AP Emergency : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి `జ‌న` భ‌యం! చంద్ర‌బాబు స‌భ‌ల‌తో వ‌ణుకు!

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రతిపక్షాలతో పాటు అధికారంలో ఉన్న వైసీపీకి కూడా వర్తిస్తుందని(Jagan Break) ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రోడ్లు ఉన్నది రాకపోకలకే తప్ప సభలు, సమావేశాల కోసం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ సభల్లో ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రత(Security)కు ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ జీవోలో కొత్తవేమీ లేవని, గతంలో ఉన్న వాటినే ఇప్పుడు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సజ్జల వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చీకటి జీవో అనడంలో అర్థంలేదని సజ్జల అన్నారు.

రోడ్లపై సభలు ప్రజలకు  కలిగించొద్దని..(Jagan Break)

రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పలేదన్నారు. రోడ్లపై సభలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెబితే కక్ష సాధింపు చర్యలని అంటే ఎలాగని ప్ర‌శ్నించారు. జీవోలోని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే కాదు వైసీపీకి కూడా వర్తిస్తాయని చెప్పారు. రోడ్ షోల‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉత్త‌ర్వులు ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఆ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాబోయే రోజుల్లో ఎవ‌రూ పాద‌యాత్ర చేయ‌డానికి అనువుగా ఉండ‌దు. బ‌స్సు యాత్ర‌లు చేయ‌డానికి ప్ర‌త్యేక అనుమ‌తులు తీసుకోవాలి. అంటే, చంద్ర‌బాబు రోడ్ షోలు, లోకేష్ పాద‌యాత్ర‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర‌కు బ్రేకులు వేసేలా ఉత్త‌ర్వులు ఉన్నాయి. ఆ విష‌యాన్ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులే కాదు సామాన్యులు సైతం చ‌ర్చించుకుంటున్నారు.

Also Read : AP CM Jagan : గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి

జ‌న‌వ‌రి 27వ తేదీ నుంచి యువ‌గ‌ళం పేరుతో లోకేష్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ప్ర‌క‌టించారు. కుప్పం నుంచి ప్రారంభించ‌డానికి సిద్ధం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు 4వేల కిలోమీట‌ర్లు యాత్ర చేయ‌బోతున్నారు. ఇక‌, సంక్రాంతి త‌రువాత ఎప్పుడైనా బ‌స్సు యాత్ర చేయ‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ సిద్ధమ‌య్యారు. ఆయ‌న ఇప్ప‌టికే వారాహి పేరుతో వాహ‌నాన్ని త‌యారు చేయించారు. దాని మీద రాజ‌కీయ ప్ర‌చారం చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇవ‌న్నీ రోడ్ల మీద జ‌రిగే షోలు. అలాగే, గ్రామాల మ‌ధ్య‌లో బ‌హిరంగ స‌భ‌లు కూడా పెట్టుకుంటారు. వీటిని అడ్డుకోవ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ తీసుకొచ్చిన జీవో రాజ‌కీయ దుమారాన్ని రేపుతోంది. పైగా ఆయ‌న స‌భ‌లోనే జీవో విడుద‌లైన తొలి రోజే ప్ర‌మాదం జ‌ర‌గ‌డం మ‌రిన్ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌కు వ‌చ్చిన వృద్దురాలు కాళ్లు విరిగిపోయాయి( Security)

రోడ్ షోలు, స‌భ‌ల‌ను నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌కు వ‌చ్చిన వృద్దురాలు కాళ్లు విరిగిపోయాయి. స‌భాస్థ‌లి వ‌ద్ద ఉన్న బ‌స్సు ఆమెను ఢీ కొట్టింది. దీంతో కింద‌ప‌డి పోయిన ఆమె మీద నుంచి బ‌స్సు వెళ్లింది. కాళ్లు విరిగిపోవ‌డంతో కాకినాడలోని జీజీహెచ్ కు వృద్ధురాలిని త‌రలించారు. వైఎస్సార్ పింఛను కానుక సభకు 70 ఏళ్లకు పైగా వయసున్న వృద్ధురాలు అర్జి పార్వతి హాజ‌ర‌య్యారు. ఆమెను బ‌స్సు ఢీకొనడంతో కిందపడిపోయారు. ఆమె కాళ్లపై నుంచి బస్సు టైర్లు వెళ్లాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ర్యాలీలు, సభలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన రోజే ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌మాద‌వ‌శాత్తు ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎవ‌రి స‌భ‌లో జ‌రిగినా దుర‌దృష్టక‌రం.

Also Read : Rule of law : `స్లీప‌ర్ సెల్‌` ఆప‌రేష‌న్ పై టీడీపీ డౌట్‌! 2004 ఎపిసోడ్ అవ‌లోక‌నం!