Jagan Board : గోవిందా..హ‌ల లూయా.!TTD భాగోతం!!

తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి విష‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Board) తొలి నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

  • Written By:
  • Updated On - August 26, 2023 / 01:49 PM IST

తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి విష‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Board) తొలి నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న సీఎం అయిన త‌రువాత వేసిన తొలి జంబో క‌మిటీ మీద న్యాయ‌స్థానానికి అప్ప‌ట్లో హిందువులు వెళ్లారు. ఆ త‌రువాత క‌మిటీని కుదించిన‌ప్ప‌టికీ 200కోట్ల మ‌నీలాండిరింగ్ కు పాల్ప‌డిన వాళ్ల‌ను కూడా మెంబ‌ర్ గా నియ‌మించారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవ‌ర్ గా మారిన శ‌ర‌శ్చంద్రారెడ్డి , మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ గా అవినీతికి పాల్ప‌డి ప‌ద‌విని కోల్పోయిన కేత‌న్ దేశాయ్ ల‌ను క‌మిటీలోకి తీసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి  భాగోతం(Jagan Board) 

శ్రీవారి సేవ‌కు ఎప్పుడు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లినా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డంలేద‌ని త‌ర‌చూ హిందువుల నుంచి వినిపించే మాట‌. ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం ఎవ‌రైనా అన్య‌మ‌త‌స్తులు తిరుమ‌ల శ్రీవారి బంగారు వాకిలి దాటాలంటే ఖ‌చ్చితంగా డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏనాడూ ఆ విధంగా చేయ‌లేద‌ని హిందూస‌మాజం నుంచి వ‌స్తోన్న విమ‌ర్శ‌లు. ముఖ్య‌మంత్రి హోదాలో డిక్ల‌రేష‌న్ అవ‌స‌రంలేద‌ని కొంద‌రు, ఎవ‌రైనా, ఏ హోదాలో ఉన్నా అన్య‌మ‌త‌స్తులు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా ఇలాంటి భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. ఇక స‌తీస‌మేతంగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు సీఎం హాజ‌రు కావాలి. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan Board) స‌తీమ‌ణి ఏనాడూ శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించే స‌మ‌యంలో క‌నిపించ‌రు. ఒంటిరిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పిస్తారు. ఆ విష‌యంలోనూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి  తిరుమ‌ల పవిత్ర‌త‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మేనంటూ

తిరుమ‌ల తిరుప‌తి ప‌విత్ర‌త ఏమిటో అంద‌రికీ తెలిసిందే. కానీ, దాన్నో ఆదాయ వ‌న‌రుగా మార్చేశార‌ని హిందూస‌మాజం మండిప‌డుతోంది. రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మారిపోయింద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. పైగా రాజ‌కీయ నాయ‌కులు ఇటీవ‌ల తిరుమ‌ల వేదిక‌పై రాజ‌కీయాంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. మాడ‌వీధుల్లో ఇష్టాసానుసారంగా మాట‌లు తూలుతున్నారు. మంత్రి హోదాలో రోజా వీఐపీ ద‌ర్శ‌నాల‌కు అనుచ‌రుల‌ను తీసుకెళ్లి ప‌లు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఇక ద‌ర్శ‌నానికి వెళి రాజ‌కీయ అంశాల‌ను ప్ర‌స్తావించిన వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఇదంతా అన్య‌మ‌త‌స్తునిగా ఉన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jagan Board) తిరుమ‌ల పవిత్ర‌త‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మేనంటూ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు.

Also Read : Tirumala Forest : జ‌గ‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ `చిరుత‌`లు

రెండుసార్లు టీటీడీ చైర్మ‌న్ గా ప‌నిచేసిన వైవీ సుబ్బారెడ్డి కూడా ప‌లు ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. శ్రీవాణి ట్ర‌స్ట్ ద్వారా సేక‌రించిన కోట్లాది రూపాయ‌ల విరాళాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించార‌ని ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు. దానిపై విచార‌ణ చేయాల‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు, హిందూస‌మాజం డిమాండ్ చేస్తూనే ఉంది. ఆయ‌న కూడా అన్య‌మ‌త‌స్తుడ‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. కార‌ణం ఆయ‌న స‌తీమ‌ణి మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణికి సోద‌రి. క్రిస్టియ‌న్ మ‌తాన్ని స్వీక‌రించిన ఫ్యామిలీగా చెబుతారు. ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సుబ్బారెడ్డి స్థానంలో ప‌క్కా క్రిస్టియ‌న్ గా ముద్ర‌ప‌డ్డ క‌రుణాక‌ర్ రెడ్డిని చైర్మ‌న్ గా నియ‌మించ‌డం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan Board) మ‌రింత పదునైనా విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేస్తున్నారు.

Also Read : Tirumala Tiger : అదిగో చిరుత‌..ఇదిగో క‌ర్ర‌.! TTDపై నెటిజ‌న్ల ట్రోల్స్, మీమ్స్ హోరు!!

నా పాల‌న నా ఇష్టం అన్న‌ట్టు తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండలి కూర్పును చేశార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఆరోప‌ణ‌లను ప్ర‌త్య‌ర్థులు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి టీటీడీ బోర్డు నియామ‌కంపై గ‌ళం విప్పారు. అవినీతి, అక్ర‌మాలు చేసిన వాళ్ల‌ను సభ్యులుగా నియ‌మించ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. ప‌విత్ర‌మైన శ్రీవారి సేవ‌కు అలాంటి వాళ్లను నియ‌మించ‌డం అన్య‌మ‌త పోక‌డంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్ర‌భుత్వం మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం మీద మండి ప‌డ్డారు. హిందూ స‌మాజం కక్క‌లేక మింగ‌లేక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరుపై ఆందోళ‌న చెందుతోంది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఇదే..