బెయిల్ పై ఉన్న వాళ్లు(Jagan Bail) అవినీతిని అరికడతామంటే నమ్మాలా? అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) చేసిన కామెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేసినట్టు ప్రత్యర్థులు భావిస్తున్నారు. బెయిల్ మీద ఉంటూ పరిపాలన సాగిస్తోన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. పలు కేసుల్లో ఆయన నిందితుడు. సుమారు 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు ఆయన హాజరు కావాలి. కానీ, సీఎం అయిన తరువాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ప్రస్తుతం బెయిల్ మీద పరిపాలన కొనసాగిస్తున్నారు.
బెయిల్ పై ఉన్న వాళ్లు అవినీతిని అరికడతామంటే నమ్మాలా?(Jagan Bail)
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న మోడీ (Narendra Modi) బెయిల్ మీద ఉన్న వాళ్లు అవినీతిని గురించి మాట్లడడం ఏమిటి? అంటూ వ్యాఖ్యానించారు. అంటే, రాహుల్ గాంధీ(Rahul gandhi) ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యల్లోని అర్థం. సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ కేసును పురస్కరించుకుని ఎంపీగా అనర్హత వేటు పడింది. జైలు శిక్ష వేసినప్పటికీ బెయిల్ మీద రాహుల్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. రాష్ట్రంలోని బీజేపీ 40శాతం కమిషన్లు తీసుకుంటూ భారీ అవినీతికి పాల్పడుతోందని ఆయన విమర్శలు చేస్తున్నారు. ప్రతి వేదికపైనా 40శాతం కమీషన్లు తీసుకుంటోన్న బీజేపీ 40 స్థానాలకు మాత్రమే పరిమితయం అయ్యేలా చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అందుకే, బెయిల్ మీద ఉన్న వాళ్లు అవినీతి గురించి మాట్లాడితే ఎలా? అంటూ రాహుల్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ తాజాగా మోడీ ప్రచారానికి పదును పెట్టారు.
కర్ణాటక ఎన్నికల సభల్లో మోడీ
కర్ణాటక ఎన్నికల సభల్లో మోడీ (Narendra Modi) చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డికి(Jagan Bail) టీడీపీ వర్తింప చేస్తోంది. దేశ వ్యాప్తంగా బెయిల్ మీద ఉన్న లీడర్లకు మోడీ చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయని చెబుతోంది. అంతేకాదు, బెయిల్ ను రద్దు చేసేలా కేంద్రం కూడా ప్రయత్నం చేయాలని కోరుతోంది. గత నాలుగేళ్లుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనలోని అక్రమాల మీద చార్జిషీట్ అంటూ ఏపీ బీజేపీ ప్రచారానికి దిగుతోంది. అదే సందర్భంలో మోడీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే, రాబోవు రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు కానుందని ప్రచారం ఊపందుకుంది. అదే జరిగితే సీఎం పదవికి గండం ఏర్పడినట్టేనని న్యాయనిపుణుల అభిప్రాయం.
జగన్మోహన్ రెడ్డి బెయిల్.రద్దు
క్విడ్ ప్రో కో కింద జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తు సంస్థలు ప్రాథమిక నిర్థారణకు వచ్చాయి. దాదాపు 30వేల కోట్ల ఆస్తులను కూడా సీబీఐ, ఈడీ అటాచ్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన కేసులు ప్రస్తుతం సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో ఉన్నాయి. వాటి మీద విచారణ జరుగుతోంది. కానీ, సీఎం అయిన తరువాత కోర్టులకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి హాజరు కావడంలేదు. బెయిల్ (Jagan Bail)మీద జగన్ కొనసాగడానికి పరోక్షంగా ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం ఉందని విపక్షాల అనుమానం.
Also Read : Jagan : అవినాష్ రెడ్డికి చెక్, తెరపైకి జగన్ మరో బ్రదర్
బెయిల్ మీద ఉన్న వాళ్ల గురించి ఇప్పుడు మోడీ (Narendra Modi) మాట్లాడడం ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోతున్నాయన్న సంకేతాలను ఇస్తోంది. అందుకే, ఆయన బెయిల్(Jagan Bail) త్వరలోనే రద్దు కానుందని ప్రచారం మొదలైయింది. లేదంటే, రాబోవు రోజుల్లో ఇదే బెయిల్ అంశం మీద నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల్లో ప్రస్తావించకుండా తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే, బెయిల్ రద్దుకు ముహూర్తం దగ్గరపడిందని విపక్షాల నమ్మకం. మొత్తం మీద ఎక్కి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు కర్ణాటక ఎన్నికల్లో మోడీ ప్రచారం జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు ప్రమాదం ఏర్పడింది.
Also Read : Jagananne Maa Bhavishyathu: 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో వైసీపీ ప్రభంజనం