Site icon HashtagU Telugu

Jagan attempt murder : కోడిక‌త్తి కేసులో టీడీపీకి NIA క్లీన్ చిట్‌

Jagan Attempt Murder

Jagan Attempt Murder

నాలుగేళ్ల క్రితం జ‌రిగిన కోడి క‌త్తి కేసు(Jagan attempt murder) వెనుక కుట్ర కోణంలేద‌ని తేలింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు ఘటనతో సంబంధం లేదని ఎన్ ఐఏ (NIA)స్ప‌ష్టం చేసింది. బాధితుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజ‌రు కావ‌డంలేదు. కానీ, లోతుగా ఈ కేసును కుట్ర కోణం నుంచి ద‌ర్యాప్తు చేయాల‌ని గ‌త విచార‌ణ సంద‌ర్భంగా పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని కౌంటర్ పిటిషన్ లో ఎన్ఐఏ చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున దర్యాప్తు మ‌రింత అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది.

కోడి క‌త్తి కేసు వెనుక కుట్ర కోణంలేద‌ని.(Jagan attempt murder)

వాదనలు వినిపించేందుకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో తదుపరి విచారణను సోమవారానికి (ఏప్రిల్ 17) ఎన్ ఐఏ కోర్టు వాయిదా వేసింది. విశాఖ విమానాశ్రయం ఆవ‌ర‌ణ‌లో కోడి కత్తి దాడి(Jagan attempt murder) నాలుగేళ్ల క్రితం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద జ‌రిగింది. ఆ కేసుకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఆ మేరకు విజయవాడలోని ఎన్‌ఐఏ(NIA) కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ 

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తితో (Jagan attempt murder) 2018 అక్టోబరులో దాడి జరగింది. దానిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు బాధితుడిగానే గాక సాక్షిగా ఉన్న జగన్‌ కూడా సోమ‌వారం హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోర్టును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరారు. ఈ సంఘటనలో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తాజాగా స్ప‌ష్టం చేసింది. సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఆ విషయం స్పష్టమైందని ప్రకటించింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తేల్చింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని చెప్పింది.

విచారణ ఈనెల 17కు వాయిదా

కోడికత్తి దాడిలో(Jagan attempt murder) కుట్రకోణం ఉందని లోతైన దర్యాప్తు జరపాలని ఈ నెల 10వ తేదీన జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని ఎన్‌ఐఏ కోరింది. అయితే వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్ తరపు లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేయ‌డం జ‌రిగింది. ఈనెల‌ 17న వాదనలు చెప్పాలని, అదే రోజు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి వెల్ల‌డించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? అనేది ఆస‌క్తిక‌రం.

కోడి కత్తి అనేది పెద్ద డ్రామా (NIA)

ఇప్పటికే టీడీపీపై చేసిన పలు ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో వైసీపీకి షాక్ త‌గిలింది. కోడికత్తి కేసు(Jagan attempt murder) కూడా టీడీపీ చేయించిందే అని వైసీపీ తీవ్ర ఆరోపణలు ఆనాడు చేసింది. ఇప్పుడు ఆ ఆరోపణలు నిజం కాదని తేలడం వైసీపీ డ్రామాను బ‌య‌ట‌పెట్టేందుకు మరో ఆయుధం టీడీపీకి దొరికినట్టైంది. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోడి కత్తి కమల్‌హాసన్ అని రుజువైందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఆనాడూ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కోడి కత్తి డ్రామా ఆడారని ఆరోపించారు. అప్ప‌ట్లో అధికారంలో ఉన్న టీడీపీపైకి నెపం నెట్టి లబ్ది పొందారని అన్నారు. పీకే ఇచ్చిన కోడి కత్తి స్క్రిప్ట్‌ను జగన్ అమలు చేశారని ఆరోపించారు. కోడి కత్తి అనేది పెద్ద డ్రామా అని తాము ముందు నుంచి చెబుతునే ఉన్నామని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని.. ఈ కేసును ఎన్‌ఐఏకు ఇవ్వాలని జగన్ కోరారని, జగన్ కోరిక మేరకే ఎన్‌ఐఏ దర్యాప్తు చేసి అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు.

Also Read : Jagan Plan: మా నమ్మకం నువ్వే జగనన్నా.. ప్రోగ్రాం ఫోకస్

ఎన్‌ఐఏ (NIA) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన త‌రువాత‌ ఈ ఘటనతో టీడీపీకి సంబంధం లేదని తేల్చింది. అధికారంలోకి వచ్చేందుకు చేసిన డ్రామా ఈరోజు బద్దలైందని అచ్చెంనాయుడు విమర్శించారు. జగన్ డ్రామాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఇప్పుడు ఎన్‌ఐఏ మీద కూడా నమ్మకం లేదంటారా? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మరేదైనా సంస్థతో దర్యాప్తు కావాలని అడుగుతారా? అంటూ మండిపడ్డారు. కుట్రలు, హత్యలు, దారుణాలు చేసిన జగన్ ను రాజకీయాలకు అనర్హుడిగా ప్రకటించాలని అచ్చెంనాయుడు డిమాండ్ చేశారు.

Also Read : Central Govt. Shocked Jagan: జగన్ కు కేంద్రం జలక్! ఇంగ్లీష్ మీడియం లేని విద్యావిధానం కు మోడీ ఆమోదం