Site icon HashtagU Telugu

Jagan : TDP నేత బీటెక్ ర‌వి భ‌ద్ర‌త‌కు ముప్పు, CBN ఆందోళ‌న‌

Jagan

Jagan

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ క్లైమాక్స్ కు చేరిన వేళ (Jagan) టీడీపీ నేత బీటెక్ ర‌వికి (Btch Ravi)సెక్యూరిటీని  తొల‌గించారు. ఆయ‌న క‌డప జిల్లా వేదిక‌గా తొలి నుంచి వైఎస్ కుటుంబానికి వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ప్ర‌త్యేకించి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం మీద బీటెక్ ర‌వి మార్క్ ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ మెజార్టీ ఓట్ల‌ను సాధించింది. ఫ‌లితంగా వెస్ట్ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ టీడీపీ కైవ‌సం చేసుకుంది. పైగా వివేకానంద మ‌ర్డ‌ర్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి వైఎస్ కుటుంబం మీద ప‌లు ఆరోప‌ణ‌ల‌ను బీటెక్ ర‌వి చేశారు. ప‌లు సంద‌ర్బాల్లో ఆయ‌న్ను ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేశారు. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా ఆ మ‌ధ్య వెల్ల‌డించారు.

టీడీపీ నేత బీటెక్ ర‌వికి సెక్యూరిటీని  తొల‌గించారు (Jagan)

ప్ర‌స్తుతం బీటెక్ ర‌వికి(Btech Ravi) సెక్యూరిటీని త‌గ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌త టీడీపీ హ‌యాంలో 2 ప్ల‌స్ 2 భ‌ద్ర‌త ఆయ‌న‌కు ఉండేది. ప్ర‌భుత్వం మారిన త‌రువాత 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త కొన‌సాగుతోంది. అక‌స్మాత్తుగా భ‌ద్ర‌త‌ను పూర్తిగా తొల‌గించారు. దీంతో టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. బీటెక్ ర‌విని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. గ‌తంలోనూ ప‌రిటాల ర‌వి హ‌త్య‌కు ముందుగా ఆయ‌న సెక్యూరిటీని మార్చారు. ప‌లు మార్లు సెక్యూరిటీని మార్చిన త‌రువాత ర‌వి హ‌త్య జ‌రిగింది. ఆ నేప‌థ్యంలో ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద ఆయ‌న త‌న‌యుడు జ‌గన్మోహ‌న్ రెడ్డి (Jagan) మీద అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు పలు ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వం చేసిన హ‌త్య‌గా భావిస్తూ అసెంబ్లీని ఆనాడు స్తంభింప చేసిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు బీటెక్ రవి విష‌యంలో ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆనాడు ప‌రిటాల విష‌యంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాదిరిగా చేస్తున్నాడ‌ని టీడీపీ అనుమానిస్తోంది.

ప‌రిటాల ర‌వి హ‌త్య‌కు ముందుగా ఆయ‌న సెక్యూరిటీని

ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌లువురి భ‌ద్ర‌త‌ను, ప్రోటోకాల్ ను తొల‌గించారు. ఆ జాబితాలో చంద్ర‌బాబునాయుడు కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ఉన్న జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను కేంద్రం ప‌ర్య‌వేక్షిస్తోంది. కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ప్ర‌కారం పైలెట్ వెహిక‌ల్ ఎప్పుడు ఆయ‌న కాన్వాయ్ లో ఉండాలి. అలాంటి ప్రోటోకాల్ ను త‌గ్గిస్తూ ఆ మ‌ధ్య జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. పైలెట్ వెహిక‌ల్ లేకుండా చేసింది. పోలీస్ భ‌ద్ర‌త‌ను కూడా త‌గ్గించింది. ఆ విష‌యం తెలుసుకున్న కేంద్రం వెంట‌నే అప్ర‌మ‌త్తం అయింది. సెక్యూరిటిని మ‌రింత పెంచింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌మాండోల సంఖ్య‌ను రెట్టింపు చేసింది.

చంద్ర‌బాబునాయుడు.జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌

పీఏసీ చైర్మ‌న్ గా ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ భ‌ద్ర‌త‌ను కూడా ఒకానొక స‌మ‌యంలో త‌గ్గించారు. ఆయ‌న‌కు ఉన్న 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డం వివాదంగా మారింది. ఆ త‌రువాత ఆయ‌న భ‌ద్ర‌త కోసం ఫైట్ చేయాల్సి వ‌చ్చింది. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి భ‌ద్ర‌త‌ను కూడా తొల‌గించారు. ఆయ‌న సెక్యూరిటీ వ‌ద్ద‌ని తొలి నుంచి చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యేకు ఉండాల్సిన క‌నీసం భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుంది. ఆ మేర‌కు ఏర్పాటు చేయాలి. కానీ, ఆయ‌న పార్టీని వీడిన త‌రువాత భ‌ద్ర‌త‌ను గాలికొదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప‌లువురు టీడీపీ నేత‌ల భ‌ద్ర‌త‌ను కుదించారు. కొంత‌మందికి పూర్తిగా తొల‌గిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read : Viveka murder case :అవినాష్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌ వాయిదా

రాష్ట్రంలోని మిగిలిన నేత‌ల భద్ర‌త‌ను తొల‌గించ‌డం కంటే క‌డ‌ప జిల్లాలోని బీ టెక్ ర‌వి(Btech Ravi) సెక్యూరిటీని తొల‌గించ‌డం మాత్రం ఆ పార్టీకి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న జిల్లాగా తొలి నుంచి క‌డ‌ప‌కు పేరుంది. పైగా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ కుటుంబం అడ్డాగా ఉంది. ఆక్క‌డ ఎవ‌రూ ఆ కుటుంబాన్ని వ్య‌తిరేకించి బ‌త‌క‌లేర‌ని ప్ర‌చారం ఉంది. అలాంటి ప్రాంతంలో ద‌శాబ్ద కాలంగా వైఎస్ కుటుంబం మీద రాజ‌కీయంగా పోరాడుతున్న లీడ‌ర్ బీటెక్ ర‌వి. అలాంటి లీడ‌ర్ కు ఉన్న భ‌ద్ర‌త‌ను తొల‌గించ‌డం ప‌లు అనుమానాల‌కు దారితీస్తోంది. అంతేకాదు, వివేకా హ‌త్య‌ను ఒకానొక సమ‌యంలో బీటెక్ ర‌వి మీదకు వైసీపీ మ‌ళ్లించింది. అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా బీటెక్ ర‌వితో ఆ హ‌త్య చేయించారని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) అండ్ టీమ్ ఆరోపించింది. ఇప్పుడు ఆ హ‌త్య కేసు విచార‌ణ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోన్న వేళ బీటెక్ రవి సెక్యూరిటీని తొల‌గించ‌డం టీడీపీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

Also Read : CM Jagan: సీఎం జగన్ లండన్ పర్యటన ఎందుకో తెలుసా?