Site icon HashtagU Telugu

Jagan : జ‌గ‌న్ కు పులిలా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబు

Jagan

Jagan Vinukonda

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడును పులితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) పోల్చారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను కురుక్షేత్ర యుద్ధంగా భావిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాన్ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌హ‌న్ రెడ్డి అనంత‌పురం జిల్లా నార్ప‌ల‌లో జ‌రిగిన వ‌స‌తి దీవెన వేదిక‌పై వెలుబుచ్చారు. ఇటీవ‌ల వైనాట్ 175 అంటూ కేక్ వాక్ లాగా ఎన్నిక‌ల‌ను తీసుకున్న ఆయ‌న ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అంటున్నారు. అంటే ఎంత తీవ్రంగా పోటీ ఉండ బోతుందో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బోధ‌ప‌డింది. అంతేకాదు, పులి మాదిరిగా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబుతో (Chandra babu) వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఎలా ఉంటాయో ఊహించుకుంటున్నారు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కురుక్షేత్రం, పులి అనే వ్యాఖ్య‌ల‌ను త‌న ప్ర‌సంగంలో జోడించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైయింది.

చంద్ర‌బాబునాయుడును పులితో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan)

న‌ర‌మాంసం తినే పులి మారిందంటే న‌మ్మ‌గ‌ల‌మా? అంటూ ముస‌లాయ‌న వ‌చ్చీరాని ఇంగ్లీషులో మోడీ విధానాల‌ను ప్ర‌శ‌సించార‌ని చంద్ర‌బాబును(Chandrababu) జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఎన్డీయేతో టీడీపీ క‌లుస్తుంద‌న్న సంకేతాలు ఇచ్చార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారం మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స్పందించారు. న‌ర‌మాంసం తినే పులి మారింద‌ని చెబితే ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అందుకే, రాబోవు కురుక్షేత్ర యుద్ధంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ ఆయ‌న ప‌రిపాలించిన స‌మ‌యంలో ఎందుకు వాటిని అమ‌లు చేయ‌లేద‌ని నిల‌దీశారు. రైతుల‌ను, నిరుద్యోగుల‌ను చంద్ర‌బాబు మోసం చేశార‌ని ఆరోపించారు. ఇదే సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఒక జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోని మాట‌ల‌ను ఎత్తిపొడిచారు.

 ఎన్నిక‌ల‌ను కురుక్షేత్ర యుద్ధంగా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో విధాన‌ప‌ర‌మైన విభేదాలు లేవ‌ని చంద్ర‌బాబు (Chandra babu) ఒక జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావించారు. అంతేకాదు, బీజేపీ, టీడీపీ మ‌ధ్య ఉన్న గ‌త సాన్నిహిత్యాన్ని కూడా అవ‌లోకించారు. నోట్ల ర‌ద్దు నుంచి విజ‌న్ 2047 వ‌ర‌కు న‌రేంద్ర మోడీ విధానాలు బాగుతున్నాయ‌ని చంద్ర‌బాబు పొగిడారు. కేవ‌లం ఏపీకి ప్ర‌త్యేక హోదా అనే విష‌యంలో మాత్ర‌మే బీజేపీతో విభేదాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. దేశాభివృద్ధి కోసం మోడీతో క‌లిసి న‌డిచేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామి కాబోతుంద‌ని తెలుగు మీడియా ఫోక‌స్ చేసింది. ఇదే అంశంపై బుధ‌వారం అనంతపురం జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)రియాక్ట్ అయ్యారు.

విద్యార్ధి నచ్చిన రంగంలో లీడర్ గా

ఎవ‌రూ చంద్ర‌బాబును న‌మ్మ‌ర‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) చెప్పుకొచ్చారు. ఎన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్యం అనేది అసాధ్య‌మ‌నే సంకేతాల‌ను ప‌రోక్షంగా ఆయ‌న ఇచ్చారు. కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డ‌ను గెలిపించుకునే బాధ్య‌త మీదేనంటూ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్నామ‌ని భావిస్తే మ‌ద్ధ‌తు ఇవ్వండ‌ని కోరారు. వ‌లంటీర్ల ద్వారా ఇళ్ల‌కు అన్ని ర‌కాల సంక్షేమ ప‌థ‌కాలు వ‌చ్చేలా చేస్తున్నామ‌ని చెప్పారు. అందుకే, మీరున్నార‌న్న విశ్వాసం, ధైర్యం త‌న‌కు ఉంద‌ని అన్నారు. దుష్ట‌చ‌తుష్ట‌యంతో పోరాడి కురుక్షేత్ర యుద్ధంలో గెల‌వాలంటే మీ బిడ్డ‌కు సంపూర్ణ స‌హ‌కారం మీరు అందించాల‌ని అభ్య‌ర్థించారు. మొత్తం మీద వెంట్రుక కూడా పీక‌లేరు, వైనాట్ 175 లాంటి మేక‌పోతుగాంభీర్యం మాట‌ల నుంచి పులి, కురుక్షేత్రం యుద్ధం అంటూ కొత్త వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : Jagan Reform : ఉచిత విద్య‌, వైద్యం దిశ‌గా సంస్క‌ర‌ణ‌లు

వ‌స‌తి దీవెన కార్య‌క్ర‌మంలో 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) జమ చేసారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసామని చెప్పారు. భవిష్యత్ కు అవసరమయ్యే విధంగా బోధనలోనూ మార్పులు చేసామన్నారు. ప్రతీ విద్యార్ధికి ట్యాబ్ అందించటం ద్వారా కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా అందరినీ చదివించే బాధ్యత తాను తీసుకుంటానని జగన్ చెప్పారు. ప్రతీ విద్యార్ధి నచ్చిన రంగంలో లీడర్ గా ఎదగాలని కోరారు. ఇదే స‌భ నుంచి రాజ‌కీయ ప్ర‌సంగం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CBN : చంద్ర‌బాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటిక‌ల్ కుట్ర‌?