Site icon HashtagU Telugu

Ambedkar Statue : అంబేద్కర్‌ విగ్రహం అందరికీ స్పూర్తి – సీఎం జగన్

Jagan Ambedkar Statue

Jagan Ambedkar Statue

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ఆవిష్కరించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో జగన్ మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శలు చేస్తూనే..అంబేద్కర్‌ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.

విజ‌య‌వాడ న‌డిబొడ్డున ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్ భారీ విగ్రహం ప్ర‌పంచంలోనే అతిపెద్ద విగ్ర‌హ‌మ‌ని, అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టికోకపోవడం అంటరానితనమే. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే. పేదపిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమే అంటూ టీడీపీ ఫై మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమలేదు. మన ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదు. అంబేద్కర్‌ భావజాలం పెత్తందారులకు నచ్చద‌ని జగన్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ లో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని చూసినప్పుడు ..మాములుగా స్టాట్యూ ఆఫ్ లిబర్టి గురించి మాట్లాడేవారం. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇండియాలో విజయవాడ పేరు ఇక మారుమోగుతుందని అన్నారు. ఈ విగ్రహాన్ని 56 నెలల్లో అడుగడుగునా అనుసరించిన విధానాలకు కనిపిస్తోంది.అంబేద్కర్‌ జన్మించి 133 సంవత్సరాల తరువాత, ఆయన మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ కింద ఈ రోజు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నారు. అంబేద్కర్‌ అంటారాని తనంపై, అధిపత్యంపై తిరుగుబాటకు భావజాలంగా ఈ విగ్రహం కనిపిస్తుంది. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటారు. రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కాపాడే మహా శక్తిగా ఆయన కనిపిస్తుంటారు. తమ గొంతు వినిపించలేని అట్టడుగున వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని, చరిత్రగతినిమార్చిన కారకులు అంబేద్కర్‌. ఈ రోజు దళితజాతి నిలబడిందన్నా కూడా, రిజర్వేషన్లు కల్పించి వారిని ఒక తాటిపై నిలిపింది ఒక్క అంబేద్కర్‌స్ఫూర్తినే. అణగారిన వర్గాలకు ఈ విగ్రహం అండగా , తోడుగా నిలబడుతుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలకు అణచివేసిన వర్గాల్లో తాను జన్మించి, చదువుకునేందుకు తమకు మాత్రమే హక్కు ఉందని భావించిన వారి కంటే గొప్పగా చదివిని గొప్ప విద్యా వేత్త అంబేద్కర్‌ అంటూ కొనియాడారు.

Read Also : Aadhaar: ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చో మీకు తెలుసా!

Exit mobile version