Site icon HashtagU Telugu

Lokesh Deputy CM Post : కూటమిలో ఏంజరగబోతుంది..?

Nara Lokesh Pawan Chandraba

Nara Lokesh Pawan Chandraba

ఏపీలో టీడీపీ మరియు జనసేన కూటమి మధ్య ప్రస్తుతం ఒక సైలెంట్ వార్ జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నారా లోకేష్ (Nara Lokesh) కు డిప్యూటీ సీఎం పదవి (Deputy CM post) ఇవ్వాలన్న డిమాండ్ ప్రస్తుతం టీడీపీ (TDP) లో వినిపిస్తున్నప్పుడు, అదే సమయంలో జనసేన (Janasena) నుండి కొందరు ఈ పధవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ వార్ సైలెంట్‌గా సాగిపోతున్నప్పటికీ, త్వరలోనే దీని ప్రభావం పార్టీ నాయకత్వంపై పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Maha Kumbh Mela 2025 : ‘వేప పుల్లల’తో లక్షలు సంపాదిస్తున్న వ్యాపారాలు

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవిని కలిగి ఉండగా, టీడీపీ లోకేష్ కు ఈ పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత ఎన్నికలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సమన్వయంతో పనిచేసి కూటమి విజయానికి కారణమయ్యారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, తన ప్రజాప్రధాన కార్యకలాపాలను కొనసాగిస్తూ, సీఎం చంద్రబాబు ఆయనకు పూర్తి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ టీడీపీ నుండి ఎక్కువై పోతుంది.

టీడీపీ నేతల డిమాండ్‌ను జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. వారు కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికీ వారు వారి డిమాండ్ లను విస్తృతం చేస్తుండడం కూటమి శ్రేణుల్లో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కూటమిలో ఏంజరగబోతుందో..? అనే ఖంగారు పట్టుకుంది. మొన్నటి వరకు అంత సజావుగా నడుస్తుండగా..ఇప్పుడు ఈ కొత్త వివాదం ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఇదే అదును చేసుకొని వైసీపీ సైతం దీనిపై మరింత వివాదం చెలరేగేలా తమ మాటలతో ఇరు వర్గాల్లో ఆగ్రహాన్ని నింపుతుంది. ఏది ఏమైనప్పటికి ఈ విషయంలో త్వరగా బాబు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నారు.