Site icon HashtagU Telugu

Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ

Telugu States 10 Years Long Disputes Andhra Pradesh Telangana Tdp Congress State Govts

Telugu States : 2014 సంవత్సరం జూన్ 2వ తేదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ రోజునే ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయింది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోయాయి. అయినా తెలుగు రాష్ట్రాల మధ్య నేటికీ ఎన్నో సమస్యలు పరిష్కారం కాలేదు. కనీసం ఏపీలో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేసి ఈ సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తాయనే ఆశాభావంతో తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు.  ఈనేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ దశలో ఉండిపోయిన ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

Also Read :Manchu Family Dispute : ‘మంచు’ ఫ్యామిలీ వివాదంలో రాజకీయ కోణం ఉందా ? ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ?

ఉద్యోగుల విభజన.. ఎక్కడ ఆగిందంటే .. ?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అనేది చాలా ముఖ్యమైన అంశం. నాలుగో తరగతి, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల విభజనపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చాయి. గెజిటెడ్, ఆపైస్థాయి ఉద్యోగుల విషయం ఇంకా తేలలేదు. ఎందుకంటే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని చాలా తక్కువ మంది గెజిటెడ్, ఇతర ఉన్నతాధికారులు కోరుకుంటున్నారు. అయితే ఏపీ నుంచి తెలంగాణకు రావాలని ఏకంగా 1,400 మందికిపైగా ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఈ వ్యత్యాసం కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఒక్కసారిగా అంతమంది ఉద్యోగులను వదులుకోలేమని ఏపీ సర్కారు చెబుతోంది. అంతమందిని ఒకేసారి తీసుకుంటే రాష్ట్రంలో పదోన్నతులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ సర్కారు(Telugu States) వాదిస్తోంది.

Also Read :Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మ‌నోజ్‌

అటకెక్కిన విద్యుత్ పంపిణీ బకాయీలు

తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్ పంపిణీ విషయానికొస్తే..  2016 సంవత్సరం వరకు ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా జరిగింది. ఆ తర్వాతి నుంచి తెలంగాణ రాష్ట్రం సెపరేటును విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. పాత విద్యుత్ పంపిణీ బకాయీల లెక్కల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రూ.26 వేల కోట్ల బకాయీలు రావాల్సి ఉందని రాష్ట్ర అధికార వర్గాలు చెబుతున్నాయి.ఏపీకి తెలంగాణ  రూ.3 వేల కోట్ల బకాయీలు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అయితే  ఈ బకాయీల చెల్లింపులో అటు తెలంగాణ కానీ.. ఇటు ఏపీ కానీ చొరవ చూపడం లేదు. దీంతో ఈ అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు దాదాపుగా జరగడం లేదు.

ఇతర అంశాలు..