Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ

జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).

Published By: HashtagU Telugu Desk
Is Telugu Desam An Obstacle To The Growth Of Janasena Harirama Jogaiah's Letter

Is Telugu Desam An Obstacle To The Growth Of Janasena Harirama Jogaiah's Letter

Harirama Jogaiah : అమరావతిః మాజీ మంత్రి హరిరామ జోగయ్య తాజాగా టిడిపి – జనసేన పార్టీల పొత్తులపై లేఖ విడుదల చేశారు. జన సేనకు 25-30 సీట్ల పొత్తు విఫల ప్రయోగమే అని ఫైర్‌ అయ్యారు. జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah). పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకు పోవటమే కారణమా..? అంటూ లేఖలో ప్రశ్నించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah). 2019లో పోటీ చేసి ఓడిపోయిన అనేకమంది జనసేన నాయకులు 2024 లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్ల కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావాహులను నిరాశ నిస్పృహలకు లోన ఎలా చేస్తున్నాయని తెలిపారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ టిడిపికి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని హరిరామ జోగయ్య ఆగ్రహించారు.

Also Read:  KTR: కాంగ్రెస్- బీజేపీది ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే!

  Last Updated: 27 Jan 2024, 02:09 PM IST