Manchu Manoj: చంద్రబాబుతో మంచు మనోజ్ భేటీ.. టీడీపీ లో చేరుతారా?

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Bhuma Mounika Reddy Manchu Manoj

Manoj Bhuma Mounika

Manchu Manoj: టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు ఈ వార్తలను విస్తృతంగా కవర్ చేస్తూ వైసీపీ శిబిరంలో కలవరం సృష్టిస్తున్నాయి. గతంలో మంచు ఫ్యామిలీకి వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అయితే టీడీపీకి చెందిన భూమా అఖిల ప్రియ సోదరి మౌనిక రెడ్డితో మంచు మనోజ్ వివాహం వైసీపీతో కుటుంబ సంబంధాలను ప్రభావితం చేసింది. ఇక మంచు సోదరుల మధ్య ఇటీవల జరిగిన గొడవను చిత్రీకరించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే, మంచు మనోజ్ ఇప్పుడు రాజకీయ మార్గాన్ని అన్వేషిస్తున్నారని, టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే వాస్తవానికి 2019 ఎన్నికల నుంచి మనోజ్ రాజకీయ అరంగేంట్రం చేయబోతున్నారని.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన ఓ స్థానం నుంచి పోటీచేస్తారని వార్తలొచ్చాయి. అది కూడా వైసీపీ తరఫున అని ప్రచారం జరిగింది. అప్పుడు మంచు ఫ్యామిలీ వైసీపీలోనే ఉంది. దీనికి తోడు ఎన్నికల ముందు ఒకట్రెండు నియోజకవర్గాల్లో మనోజ్ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. పొలిటికల్ ఎంట్రీ లేదు..  ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు మరోసారి ఇలా చంద్రబాబుతో మనోజ్ భేటీ కాబోతుండటం మరోసారి చర్చతో పాటు ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Rajnikanth: నా జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదే: రజనీకాంత్

  Last Updated: 31 Jul 2023, 06:09 PM IST