Iron Sculptures : అమరావతి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐర‌న్’ శిల్పాలు

దీంతో పాటు అమ‌రావ‌తి అక్ష‌రాలు కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా అంద‌రీ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వీటిని ఐరన్‌ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.

Published By: HashtagU Telugu Desk
'Iron' sculptures a special attraction at Amaravati celebrations

'Iron' sculptures a special attraction at Amaravati celebrations

Iron Sculptures : నేడు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులను ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలో స‌భావేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన ‘ఐర‌న్’ శిల్పాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలుస్తున్నాయి. కాల‌చ‌క్రం, ఎన్‌టీఆర్‌, బుద్ధుడు, సింహం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విగ్ర‌హాల‌తో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో పాటు అమ‌రావ‌తి అక్ష‌రాలు కూడా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా అంద‌రీ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వీటిని ఐరన్‌ స్క్రాప్‌తో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.

Read Also: Pak Citizens : మళ్లీ వాఘా సరిహద్దును తెరిచిన పాకిస్థాన్‌

ఇక, ఈ వేడుకలకు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి భారీ సంఖ్య‌లో జ‌నాలు రాజ‌ధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఈ కళాఖండాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక రైతులు కూడా ఈ కళాఖండాలను చూసి ముగ్ధులయ్యారని, వీటిని శాశ్వతంగా అమరావతిలోని ఏదైనా కూడలిలో ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు వెంకటేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కళాకారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి అమరావతి పునః నిర్మాణ పనుల కోసం వస్తున్నారని తెలిసిన వెంటనే, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైనా ఒక ప్రత్యేక కళాఖండాన్ని అమరావతిలో ప్రదర్శించాలని భావించాం. ఐరన్ స్క్రాప్ విగ్రహాల తయారీలో మాకు మంచి గుర్తింపు ఉంది, అందుకే ఈ మాధ్యమాన్నే ఎంచుకున్నాం” అని తెలిపారు. గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, చెన్నై వంటి నగరాల నుంచి స్క్రాప్‌ను సేకరించినట్లు ఆయన వివరించారు.

Read Also: Pahalgam Attack: ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి.. వెలుగులోకి మ‌రో కీల‌క విష‌యం!

 

 

  Last Updated: 02 May 2025, 01:29 PM IST