ఇప్పాల రవీంద్రారెడ్డి (Ippala Ravindra Reddy) ఈ పేరు తెలియని నెటిజన్లు ఉండరు. ముఖ్యంగా టీడీపీ , వైసీపీ వారు. గతంలో సోషల్ మీడియాలో అత్యంత ఘోరంగా టీడీపీ(TDP)ని, చంద్రబాబు కుటుంబాన్ని (Chandrababu Family) విమర్శించిన వ్యక్తి ఇతడు. వ్యక్తిగత దూషణలకు దిగుతూ, నేరుగా వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అతను, ఇప్పుడు నారా లోకేష్(Nara Lokesh)తో షేక్ హ్యాండ్ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన టీడీపీ కార్యకర్తల మనోభావాలను గాయపరిచింది. ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని లోకేష్ కలవడం వెనుక అసలు కథ ఏమిటన్నది ఇప్పుడు కార్యకర్తల మధ్య తీవ్రంగా చర్చనీయాంశమైంది.
YS Avinash Reddy : అవినాష్ రెడ్డి కి బిగిస్తున్న ఉచ్చు
సాధారణంగా రాజకీయ నాయకుడిని కలిసే ప్రతి ఒక్కరి బ్యాక్‌గ్రౌండ్‌ను పరీక్షించే టీమ్ ఉండాలి. అంతేకాకుండా సిస్కో వంటి అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలకు ముందుగా జాబితా సిద్ధమవుతుందనేది సర్వసాధారణం. అయితే లోకేష్ టీమ్ ఇప్పుడు చేసిన తప్పిదం వల్లనే ఇలాంటి వివాదం చెలరేగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరన్నది లోకేష్‌కు తెలియకపోవచ్చు, కానీ ఆయన చుట్టూ ఉన్న టీంకు మాత్రం తప్పకుండా తెలుసు. కానీ అవేమి పట్టించుకోకుండా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్‌ను కలిసే వ్యక్తుల గురించి ముందుగా పరిశీలించాల్సిన బాధ్యత టీడీపీ నేతలదే. అలా కాకుండా, సామాజిక మాధ్యమాల్లో టీడీపీకి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అధికారికంగా కలవడం నిజంగా తప్పిదమే. టీడీపీ కార్యకర్తలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.