Site icon HashtagU Telugu

Investment : కుప్పంలో భారీ కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్ 8 వేల మందికి ఉపాధి

Huge Companies Invest In Ku

Huge Companies Invest In Ku

స్వర్ణాంధ్ర విజన్‌(Swarnandhra Vision)ను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)నడిపిస్తున్న అభివృద్ధి యాత్రలో తాజాగా మరో కీలక అడుగు పడింది. సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ (MMPCL) మరియు మదర్ డెయిరీ తమ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. సోమవారం చిత్తూరులోని సీఎం నివాసంలో ఈ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలుసుకుని, తమ ప్రణాళికలపై చర్చించారు. ప్రభుత్వం ఈ యూనిట్ల కోసం అవసరమైన భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలోని 8,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నాయని సీఎం తెలిపారు.

Yuvraj Singh: గుజ‌రాత్ టైటాన్స్‌లోకి యువ‌రాజ్ సింగ్‌.. మెంటార్‌గా అవ‌తారం?

ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులకు అవసరమైన పాలు, పండ్ల గుజ్జును నేరుగా రైతుల నుంచే సేకరించనున్నాయి. ఈ విధానం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. మహిళల పాల ఉత్పత్తులు, ఉద్యానవన ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా రైతులకు స్థిర ఆదాయం, గ్రామీణులకు ఉపాధి లభించనుంది. శ్రీజ సంస్థ పాల ప్రాసెసింగ్ యూనిట్, మదర్ డెయిరీ పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్‌ను వచ్చే 18 నెలల్లో ప్రారంభించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ యూనిట్లు కుప్పం ప్రాంత అభివృద్ధి అథారిటీ (KADA)తో గతంలో కుదిరిన ఒప్పందాల అనుసంధానంలో ఉంటాయని పేర్కొన్నారు.

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అల‌ర్ట్‌!

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎరువులు, రసాయనాల ఉత్పత్తి, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు, రిలయన్స్ సంస్థ 500 బయో గ్యాస్ యూనిట్ల స్థాపన వంటి పలు ప్రాజెక్టులు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకెళ్తున్నాయి. ఈ ప్లాంట్లు హరిత ఇంధనంపై ఆధారపడి ఉండటంతో విదేశాల్లో భారీ డిమాండ్ ఉండనుందని చంద్రబాబు తెలిపారు. రైతులకు గడ్డి పెంపకానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున కౌలు చెల్లించి, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version