Site icon HashtagU Telugu

AP : ఈరోజు చంద్రబాబు కేసుల ఫై పలు కోర్ట్ లలో విచారణ

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఫై పెట్టిన కేసుల ఫై ఈరోజు ఏసీబీ కోర్ట్ , హైకోర్టు , సుప్రీం కోర్ట్ లలో విచారణ జరగబోతుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో చంద్రబాబు అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆయనపై పలు కేసులు నమోదు చేయడం తో మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగనుంది.

అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డ కేసులో పిటి వారెంట్‌తో పాటు కస్టడీ పిటిషన్‌పైనా ఏసీబీ కోర్టు(ACB Court)లో విచారణ జరుగనుంది. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసుపైనా ఏసీబీ కోర్టులో పిటి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. దీనిపైనా కోర్టు విచారణ చేపట్టే అవకకాశం ఉంది. ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరుగునుంది. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు డిస్మిస్ చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంను చంద్రభాను తరుపు లాయర్లు ఆశ్రయించారు. ఆ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరుగనుంది. ఇలా పలు కేసులకు సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది ఉంది.

Read Also : Hyderabad: రాహుల్ గాంధీ నీకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్..

ఇదిలా ఉంటె స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా CID అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబు విచారించారు. దాదాపు 120 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో సీఐడీ అధికారులకు కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 5వ తేదీ వరకు బాబు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు.