Prashant Kishor: `పీకే` నోట‌ కోడి క‌త్తి, బాబాయ్ హ‌త్య త్వ‌ర‌లో..?

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌యానికి స‌హ‌కారం అందించి త‌ప్పుచేశాన‌ని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు వెనుక ఏముంది?

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:15 PM IST

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌యానికి స‌హ‌కారం అందించి త‌ప్పుచేశాన‌ని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు వెనుక ఏముంది? ఇప్పుడు ఎందుకు ఆ కామెంట్స్ ఆయ‌న చేశారు? బీహార్ సీఎం నితీష్ తో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఎందుకు పోల్చారు? రాబోవు రోజుల్లో కోడి క‌త్తి కేసు, బాబాయ్ హ‌త్య కేసులోని ర‌హ‌స్యాల‌ను కూడా పీకే బ‌య‌ట‌పెడ‌తారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్ సీఎం కావ‌డం ఆయ‌న ల‌క్ష్యం. అందుకోసం పాద‌యాత్ర‌కు పూనుకున్నారు. ఆ సంద‌ర్భంగా నితీష్ కుమార్ ఇప్ప‌టికీ బీజేపీకి తొత్తుగా ఉన్నార‌ని ప‌లు సంద‌ర్భాల్లో అనుమానాలు రేకెత్తించారు. అదే సంద‌ర్భంలో జాతీయ రాజ‌కీయాల‌పై ఆయ‌న వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్య‌క్షురాలు సోనియాను క‌లిశారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీతోనూ, ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ క‌లిసి న‌డిస్తే బాగుంటుందని ఆమెకు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ లోని కీల‌క పాయింట్.

Also Read:   AP Formation Day : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భావ దినోత్స‌వం.. పొట్టి శ్రీరాముల‌కు నివాళ్లర్పించిన సీఎం జ‌గ‌న్‌

తొలుత యూపీఏ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల త‌రువాత పీకే ప‌లు ర‌కాలుగా రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించారు. మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీనేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ తోనూ అదే మాట చెప్పించారు. బెంగాల్ సీఎం మ‌మ‌త‌తోనూ యూపీఏ మ‌నుగ‌డలో లేద‌నే సంకేతాలు ఇప్పించారు. ఆ త‌రువాత సోనియా వ‌ద్ద‌కు వెళ్లి యూపీఏ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గాంధీయేత‌ర కుటుంబీకులు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు కావాల‌ని ఆయ‌న ఇచ్చిన సంచ‌ల‌న స‌ల‌హా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమ‌లు చేసింది. ఇక తెలంగాణ‌, ఏపీల్లోని టీఆర్ఎస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డం `పీకే` చెప్పిన పాయింట్లోని మ‌లుపు తిప్పే ఘ‌ట్టం.

ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో క‌లివిడిగా `పీకే` రాజ‌కీయాలు చేస్తున్నారు. ప‌లుమార్లు ఫాంహౌస్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ల‌లో వాళ్లిద్ద‌రూ క‌లుసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ వెనుక కూడా ప్ర‌శాంత్ కిషోర్ ఉన్నార‌ని అంద‌రికీ తెలిసిందే. జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ కేసీఆర్ చెబుతోన్న నినాదం కూడా పీకే త‌యారు చేసిందేన‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. ఇదంతా రాబోవు రోజుల్లో కాంగ్రెస్ ను క‌లుపుకుని యూపీఏను అధికారంలోకి తీసుకురావ‌డానికి పీకే వేసిన ఎత్తుగ‌డ‌ల్లో ఒక‌టి. అందుకే, ఆయ‌న సోనియాను క‌లిసిన త‌రువాత సీఎం కేసీఆర్ మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌ల‌ను త‌గ్గించింది. అంతేకాదు, రాహుల్ కు మ‌ద్ధ‌తుగా కేసీఆర్ మీడియా వేదిక‌గా ప‌లు సంద‌ర్భాల్లో ఇటీవ‌ల‌ వాయిస్ వినిపించారు.

Also Read:   Munugode bypoll: నేటితో మునుగోడు ప్రచారానికి తెర..!

దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా ఉండే శ‌క్తుల‌ను ఏకం చేస్తోన్న ప్ర‌శాంత్ కిషోర్ కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం అంత‌బ‌ట్ట‌డంలేద‌ట‌. అందుకే, రాజ‌కీయంగా ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డానికి 2019లో అందించిన ఖ‌రీదైన స‌హ‌కారం గురించి ఇప్పుడు ప్ర‌స్తావించార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఏపీలో బ‌లోపేతం చేస్తే ఆటోమేటిక్ గా వైఎస్సాఆర్ కాంగ్రెస్ బల‌ప‌డుతుంద‌ని ఆయ‌న ఆలోచ‌న‌. అందుకే, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ , క‌మ్యూనిస్ట్ ల పొత్తును ఏపీలో ఖ‌రారు చేయ‌డానికి `పీకే` ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అప్పుడు ఏపీలోని ఎంపీల సంఖ్య ఎక్కువ‌గా బీఆర్ఎస్ కూట‌మి లేదా టీడీపీ, జ‌న‌సేన‌ కూట‌మికి(బీజేపీ లేకుండా) వ‌స్తాయ‌ని ఆయ‌న ఈక్వేష‌న్ గా ఉండొచ్చు. ఫ‌లితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య అమాంతం ప‌డిపోవ‌డం ఆటోమేటిక్ గా జ‌రుగుతుంది. అందుకే, ఎన్డీయేతో అంట‌కాగుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌వాను త‌గ్గించ‌డానికి `పీకే` తాజాగా సంచ‌ల‌న కామెంట్స్ చేశార‌ని వినికిడి.

ఇక బీహార్ సీఎం నితీష్ 2024 ఎన్నిక‌ల్లోనూ అవ‌స‌ర‌మైతే బీజేపీకి మ‌ద్ధ‌తు ఇస్తార‌ని `పీకే` అనుమానం. అందుకే, బీజేపీ కోవ‌ర్ట్ గా నితీష్ మీద వ్యూహాత్మ‌కంగా ప్ర‌శాంత్ కిషోర్ ఇప్ప‌టి నుంచే ముద్ర వేస్తున్నారు. ఆర్జీడీ, కాంగ్రెస్, జేడీయూ కూట‌మి నుంచి కాంగ్రెస్ పార్టీని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం ఆయ‌న ల‌క్ష్యం. అప్పుడు పీకే పార్టీ ప్ల‌స్ కాంగ్రెస్ ప్ల‌స్ ఎంఐఎం ప్ల‌స్ ఆర్జీడీ కూట‌మి గా వెళ్లొచ్చ‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అప్పుడు బీజేపీ, జేడీయూ మ‌ధ్య ఓట్ల చీలిక జ‌రిగితే, తేలిగ్గా బీహార్లో ఎంపీల సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చ‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశారు. అందుకే, నితీష్‌, జ‌గ‌న్ ను ఒకే గాట‌న క‌ట్టేస్తూ బీజేపీకి కోవ‌ర్ట్ లుగా ముద్ర వేసే ప్ర‌య‌త్నం పీకే మొద‌లుపెట్టార‌ని తాజా కామెంట్లతో అర్థం అవుతోంది.

Also Read:  AP : శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు..!!

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడిక్కిన త‌రువాత కోడిక‌త్తి, బాబాయ్ హ‌త్య‌ల వెనుక ర‌హ‌స్యాన్ని కూడా `పీకే` బ‌య‌ట పెడ‌తార‌ని ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్య‌ర్థులు ఊహిస్తున్నారు. అదే జ‌రిగితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డామేజ్ జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.