Minister Lokesh : మంత్రి నారా లోకేష్ అమరావతి సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్లు రెండవ రోజు సదస్సులో మాట్లాడుతూ..పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభిస్తుందని అన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి మనం ముందు ఉండాలని, పోటీ పడుతూ పనిచేయాలి అప్పుడే పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. పెద్ద పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని ప్రతిపాదనలు వస్తే వాటిని సచివాలయం స్థాయి నుంచి మేం పర్యవేక్షిస్తుంటామని, కానీ జిల్లాల్లో ఎంఎస్ఎంఈ రంగంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకు వస్తున్న వారికి అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగరాదని, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ అన్నారు.
ఎంఎస్ఎంఈ రంగంలో 80 శాతం ఉద్యోగాలు కల్పించవచ్చుని, జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలకు వచ్చే పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని అన్నారు. రోజుల్లోనే పనులు జరిగిపోవాలన్నారు. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయని.. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను లోకేష్ కోరారు. రాష్ట్రలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పరిశ్రమల శాఖపై కార్డు ఎస్.యువరాజ్ ప్రజేటెషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి తరహాలోనే రైతులను పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో భాగస్వాములను చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. అల్సెలార్ మిట్టల్ పరిశ్రమ రామాయపట్నం వద్ద బీపీసీఎల్ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చంద్రబాబు తెలిపారు. వివిధ రంగాల్లో ఎంఈలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎంఎస్ ఎంఈలను చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని శివారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుందని లోకేష్ వెల్లడించారు.