Site icon HashtagU Telugu

Suicide : ద్వార‌కా తిరుమ‌ల‌లో విషాదం.. పెళ్లికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య

Suicide Hanging 19

Suicide Hanging 19

ఏలూరు జిల్లా ద్వార‌కా తిరుమ‌ల గ్రామంలో విషాదం నెల‌కొంది. ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఓ ఉద్యోగి పెళ్లికి పదిరోజులు ముందు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాలుగో కుమారుడు హరిబాబు(33) ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడికి పెళ్లి ఫిక్స్ అయింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ బాబు అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ రోజు ఉదయం ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు కొట్టగా హరిబాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. కిందకు చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపారు.

Exit mobile version