Site icon HashtagU Telugu

Laser Weapon: భారత్‌కు లేజర్ ఆయుధం.. కర్నూలులో ప్రయోగం సక్సెస్

India Laser Weapon Drdo Directed Energy Weapon System Kurnool Andhra Pradesh

Laser Weapon: తొలిసారిగా ఒక లేజర్ ఆయుధాన్ని భారత్ పరీక్షించింది. దాని పేరు.. ‘డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్‌(డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)’. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉన్న నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజ్‌లో దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు తొలిసారిగా టెస్ట్ చేశారు. ఈ లేజర్ ఆయుధానికి సంబంధించిన సిస్టమ్ ఒక  వాహనంలో ఉంటుంది. దానిలో వివిధ రకాల బల్బులు ఉంటాయి. ఆ బల్బులను ఆకాశం వైపుగా తిప్పుతారు. ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రోన్‌ను లక్ష్యంగా.. లేజర్ ఆయుధంలోని బల్బుల నుంచి లేజర్ కిరణాలను వదులుతారు. ఈ కిరణాలు తాకగానే ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఒక డ్రోన్‌కు(Laser Weapon) మంటలు అంటుకున్నాయి. అది వెంటనే నేలకూలింది. ఎంకే-2(ఏ)ను వినియోగించి లేజర్‌ కిరణాలతో వివిధ డ్రోన్ల సమూహాలను, ఫిక్స్‌డ్‌ వింగ్‌ యూఏవీలను ధ్వంసం చేశారు.  ఇదంతా కర్నూలులో జరిగిన టెస్ట్ ట్రయల్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్‌కు లేజర్ ఆయుధం రావడంపై భారతీయులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read :Mehul Choksi : మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్.. బెల్జియం నుంచి భారత్‌కు ?

డ్రోన్లకు చెక్ పెట్టేందుకు..

ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్న సమయాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలోనూ డ్రోన్లదే ముఖ్య భూమికగా ఉంది. అందుకే డ్రోన్లను నేలకూల్చే లేజర్ ఆయుధాన్ని పొందే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఈ తరహా టెక్నాలజీ అమెరికా, చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల వద్దే ఉంది. మొత్తం మీద ఈ లేజర్ ఆయుధంతో భారత్‌కు స్టార్‌ వార్స్‌ సామర్థ్యం వస్తుంది. ఎంకే-2(ఏ) డీఈడబ్ల్యూ లేజర్‌ ఆయుధాన్ని భారత్  పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. ఇది సుదూరంలోని డ్రోన్లను కూడా మెరుపు వేగంతో బూడిద చేయగలదు. శత్రువుల నిఘా సెన్సర్లకు కూడా ఇది అడ్డుకట్ట వేయగలదు.

Also Read :Kumar Mangalam Birla : కుమార్‌ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్‌

ఈ సంస్థల సహకారంతో.. 

ఈ ఆయుధం రూపకల్పనలో డీఆర్‌డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ హైఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సెస్ (చెస్‌) హైదరాబాద్‌, ఎల్‌ఆర్‌డీఈ, ఐఆర్‌డీఈ, డీఎల్‌ఆర్‌ఎల్‌ సహా వివిధ విద్యాసంస్థలు, పరిశ్రమలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ ఆయుధ వ్యవస్థ భారత సైన్యానికి అందుబాటులోకి వస్తే,  మందుగుండు సామగ్రి వినియోగం చాలావరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.