Site icon HashtagU Telugu

Independence day 2023 : చంద్ర‌బాబు స్వాతంత్ర్య‌దినోత్స‌వం గిప్ట్ విజ‌న్ 2047

Independence Day 2023

Independence Day 2023

Independence day 2023 :  విజ‌న్ 2047 ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆవిష్క‌రించ‌బోతున్నారు. రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం 2020 విజ‌న్ డాక్యుమెంట్ ను త‌యారు చేసిన ఆయ‌న ఇప్పుడు 2047 దిశ‌గా బ్లూ ప్రింట్ ను సిద్ధం చేశారు. రాబోవు రోజుల్లో ఇండియా ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1గా నిల‌వ‌డానికి ఉప‌యోగ‌ప‌డేలా విజ‌న్ 2047 రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. దాన్ని య‌థాత‌దంగా అమ‌లు చేస్తే ఇండియా ఏ విధంగా 2047 నాటికి ఉండ‌బోతుంది? అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌బోతున్నారు.

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా  చంద్ర‌బాబు  విజ‌న్  2047 (Independence day 2023)

స్వాతంత్ర్య దినోత్స‌వం (Independence day 2023)  సంద‌ర్భంగా విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా చేసుకుని చంద్ర‌బాబు ఈ విజ‌న్ డాక్యుమెంట్ ను బ‌య‌ట‌పెట్ట‌బోతున్నారు. దాన్ని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) సంస్థ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసింది. ఆ సంస్థ‌కు చైర్మ‌న్ గా చంద్ర‌బాబు ఉన్నారు. తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఈ డాక్యుమెంట్ లో ప్ర‌ధానంగా ఐదు ర‌కాల వ్యూహాల‌ను ఉన్నాయ‌ని తెలుస్తోంది. వాటిని అమ‌లు చేయ‌డం ద్వారా గ్లోబ‌ల్ లీడ‌ర్ గా భార‌త‌దేశం మారుతుంద‌ని ఆంచ‌నా వేస్తున్నారు.

అప్ప‌ట్లో చంద్ర‌బాబు త‌యారు చేసిన విజ‌న్ ఫ‌లాల‌ను

గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) సంస్థలో విద్యావేత్త‌లు, వివిధ రంగాల‌కు చెందిన నిపుణులు, మీడియా ప్ర‌ముఖులు ఉన్నారు. దేశంలోని వ‌న‌రులు, సంప‌ద సృష్టి, భౌగోళిక ప‌రిస్థితులు, ప్ర‌పంచ దేశాల ఆర్థిక స్థితిగ‌తులు త‌దిత‌రాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌రువాత విజ‌న్ 2047 రూప‌క‌ల్ప‌న (Independence day 2023)   జ‌రిగింది. ఆ డ్యాకుమెంట్ రాబోవు రోజుల్లో ఇండియాకు కీల‌కం కానుంది. ఎందుకంటే, గ‌తంలోనూ విజ‌న్ 2020 ఉమ్మ‌డికి ఏపీకి కీల‌కం అయింది. ప్ర‌స్తుతం అప్ప‌ట్లో చంద్ర‌బాబు త‌యారు చేసిన విజ‌న్ ఫ‌లాల‌ను తెలంగాణ స‌మాజం అనుభ‌విస్తోంది.

2029 దేశంలోనే నెంబ‌ర్ 1గా ఏపీ ప్ర‌గ‌తి

ఒకప్పుడు విజ‌న్ 2020 మీద ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీల నేత‌లు ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. దాన్ని 420 విజ‌న్ అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.అప్ప‌ట్లో చంద్ర‌బాబును పిచ్చి తుగ్ల‌క్ అంటూ పేరుమోసిన కాంగ్రెస్ లీడ‌ర్లు నోరుపారేసుకున్నారు. ప్ర‌త్యేకవాదులు చంద్ర‌బాబును దోపిడీదారుగా చిత్రీక‌రించారు. సీన్ కట్ చేస్తే, వాళ్లు ఇప్పుడు చంద్ర‌బాబు విజ‌న్ 2020ను ప్ర‌శంసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 24 గంట‌ల విద్యుత్, మంచినీళ్లు, ఉపాథి అవకాశాలు పెర‌గ‌డం, పారిశ్రామిక ప్ర‌గ‌తి త‌దిత‌రాలన్నీ చంద్ర‌బాబు విజ‌న్ ఫ‌లిత‌మే. ఇప్పుడు తెలంగాణ స‌మాజం క‌ళ్లారా ఆ విజ‌న్ ను చూస్తోంది. ఉమ్మ‌డి ఏపీ ప్ర‌జ‌లు విజ‌న్ 2020 విలువను తెలుసుకున్నారు. ఎక‌రా 100కోట్ల‌కు హైద‌రాబాద్ లోని భూములు అమ్ముతున్నాయంటే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు వేసిన పునాదులేనంటూ (Independence day 2023)  టీడీపీ చెబుతోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్లు కూడా పైకి అంగీక‌రించన‌ప్ప‌టికీ ఔనంటూ త‌లాడిస్తున్నారు.

Also Read : CBN Achievement : చంద్ర‌బాబు తుఫాన్! TDPలోకి బాలినేని?

ప్ర‌స్తుతం విజ‌న్ 2047 గురించి ఆలోచించ‌డానికి కార‌ణంగా కూడా గ‌తానుభ‌వాలే. ఆయ‌న త‌యారు చేసిన విజ‌న్లో విడిపోయిన ఏపీ కీల‌కం కానుంది. దేశంలోనే 2029కి ఏపీ నెంబ‌ర్ 1 కానుంది. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1గా భార‌త‌దేశం కావడానికి ఏపీ పాత్ర ప్ర‌ముఖంగా ఉండ‌నుంది. తెలంగాణ‌కులేని వ‌న‌రులు చాలా ఏపీకి ఉన్నాయి. వాటిని నియోగించుకోవ‌డం ద్వారా దేశంలోనే నెంబ‌ర్ 1గా ఏపీ ప్ర‌గ‌తి ఉంటుంద‌ని విజ‌న్ 2047 త‌యారు అయింది. దాన్ని అమ‌లు చేయాలంటే చంద్ర‌బాబు అధికారంలోకి రావాల‌ని టీడీపీ పిలుపు ఇవ్వ‌నుంది. ఆ డాక్యుమెంట్ ను స్వాతంత్ర్య‌దినోత్స‌వం నాడు ఆవిష్క‌రించడం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల్ని ఆలోచింప చేయాల‌ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా ఉంది.

Also Read : CBN Trend : ఉత్త‌రాంధ్ర‌లో చంద్ర‌బాబు`విజ‌న్`విష్‌