Site icon HashtagU Telugu

Yuva Galam : ముద్దులు, హ‌గ్ లు నిషేధం! నిరాడంబ‌రంగా `లోకేష్‌` యువ‌గ‌ళం!

Yuvagalam

Lokesh Yuva Galam

ముద్దులు, షాంపూల‌తో త‌ల‌రుద్ద‌డం త‌దిత‌ర (No Hugs)భౌతిక సాన్నిహిత్యాలపై `యువ గ‌ళం`(Yuva galam) నిషేధం పెట్టింది. అలాంటి సీన్లకు తావులేకుండా నిరాడంబ‌రంగా పాద‌యాత్ర‌ను టీడీపీ డిజైన్ చేసింది. ప్ర‌ధానంగా యువ‌త‌ను చైత‌న్య ప‌రిచే దిశ‌గా లోకేష్ (Lokesh) పాద‌యాత్ర ఉండేలా బ్లూ ప్రింట్ సిద్ధం అయింది. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర సంద‌ర్భంగా కురిపించిన ముద్దులు, హగ్ లు, త‌ల‌పై చేయిపెట్ట‌డం, షాంపూల‌తో త‌ల‌రుద్ద‌డం త‌దిత‌ర విన్యాసాలు ఉండ‌వ‌ని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెంనాయుడు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కౌగిలింతులు, ముద్దులు, మురిపాలు (yuva Galam)

సాధార‌ణంగా పాద‌యాత్ర అన‌గానే గుర్తొచ్చేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కౌగిలింతులు(No Hugs), ముద్దులు, మురిపాలు. ఏ క‌మ్యూనిటీకి వెళితే అక్క‌డ  వేషాల‌ను  ధరించ‌డం క‌నిపిస్తోంది. ప‌లు ర‌కాల విన్యాసాల‌కు పాద‌యాత్ర‌లు వేదిక‌లుగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. వాటికి భిన్నంగా లోకేష్ చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర `యువ‌గ‌ళం`(Yuva galam) డిజైన్ ఉంది. మాస్ యాంగిల్ కంటే క్లాస్ యాంగిల్ ఫోక‌స్ అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. విద్యావంతులు, విద్యార్థులు, వివిధ రంగాల్లోని యువ‌కుల‌ను క‌లిసేలా రోడ్ మ్యాప్ సిద్ధమైయింది.

Also Read : Nara Lokesh Padayatra : యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర

ప్ర‌పంచంతో పోటీప‌డేలా యువ‌త‌కు దిశానిర్దేశం చేయ‌డంతో పాటు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా దిశానిర్దేశం కూడా చేయ‌నున్నార‌ని తెలిసింది. గ‌త రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయ రంగం వైపు యువ‌త చూడ‌డంలేదు. టాలెంట్ ఉన్న వాళ్లు ఉద్యోగాల కోసం విదేశాల‌కు వెళుతున్నారు. వివిధ రంగాల్లో స్థిర‌ప‌డుతున్నారు. రాజ‌కీయ రంగం అంటేనే అస‌హ్యం వేసేలా ప‌రిస్థితులు ఉండ‌డాన్ని మార్చేయాల‌నే ఆలోచ‌న లోకేష్ (Lokesh) చేస్తున్నార‌ట‌. ఆ దిశ‌గా యువ‌త‌ను సంసిద్ధం చేయ‌డానికి ప‌లు అంశాల‌పై టౌన్ హాల్ మీటింగ్ ల‌ను నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

టౌన్ హాల్ మీటింగ్ ల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా 

సాధార‌ణంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టౌన్ హాల్ మీటింగ్ ల‌ను నిర్వ‌హిస్తారు. ప్ర‌త్యేకించి ఎన్నిక‌ల సంద‌ర్భంగా అలాంటి జ‌రుగుతుంటాయి. వాటి త‌ర‌హాలో మీటింగ్ ల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా ఏపీలోని యువ‌త‌ను ఆలోచింప చేసే అంశాల‌ను చ‌ర్చ‌కు పెట్టాల‌ని లోకేష్ సిద్ద‌మైన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను తెలియ‌చేస్తూ, తెలుగుదేశం రెండోసారి అధికారంలోకి వ‌చ్చి ఉంటే ఎంత అభివృద్ధి జ‌రిగేదో వివ‌రించ‌డంపై ప్ర‌ధానంగా ఫోక‌స్ చేయ‌బోతున్నార‌ట‌. రాజ‌కీయ విమ‌ర్శ‌ల కంటే యువ‌త‌ను ఆలోచింప చేసే అంశాల‌పై ఎక్కువ‌గా పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌న‌కు తీసుకురావాల‌ని వ్యూహ‌క‌ర్త‌లు ఎజెండాను ఫిక్స్ చేసిన‌ట్టు వినికిడి.

Also Read : KGF Star meets Lokesh: నారా లోకేశ్ తో యశ్.. ఆసక్తి రేపుతున్న భేటీ!

ప్ర‌స్తుతం ఏపీలోని యువ‌త ఎక్కువ‌గా డ్ర‌గ్స్, గంజాయి బారీన ప‌డుతున్నారు. మహిళలు అత్యాచారాలకు గురవుతున్న సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో ఆనాడు టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఉన్న లా అండ్ ఆర్డ‌ర్ ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ఉన్న ప‌రిస్థితుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ పోల్చుతూ విత్ డేటా ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్నారు. అమ‌రావ‌తి, పోల‌వ‌రం, విశాఖ రైల్వే, పోర్టు నిర్మాణం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు త‌దిత‌ర మౌలిక వ‌సతుల క‌ల్ప‌న నెమ్మ‌దించింది. ఫ‌లితంగా ఏపీలోని యువతకు ఉపాధి లేకుండా పోయింది. వివిధ ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లే వాళ్ల సంఖ్య పెరిగింది. ఇలాంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వినూత్నంగా `యువ‌గ‌ళం` పాద‌యాత్ర ఉండ‌బోతుంది. దీనిలో పాల్గొనాల‌ని అనుకునే వాళ్లు 9686296862కి మిస్డ్ కాల్ ఇచ్చి పాల్గొనాల‌ను పిలుపు నివ్వ‌డం కొత్త పంథాలో లోకేష్ పాద‌యాత్ర ఉంటుంద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నంగా ఉంది.

లోకేష్ పాదయాత్ర జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్‌, పోస్ట‌ర్ల‌ను బుధ‌వారం టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్లు విడుద‌ల చేశారు. యాత్ర‌కు సంబంధించిన లోగో, టైటిల్ ను ఆవిష్క‌రించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లోకేష్ పాద‌యాత్ర ఉంటుంది. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 100 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ట‌చ్ చేస్తూ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉండేలా డిజైన్ చేశారు. యువత, మహిళ, రైతు సమస్యలు ప్రతిబింబించేలా పాదయాత్ర వినూత్నంగా ఉండ‌నుంది. యువతకు భరోసా ఇవ్వడంతో పాటు భవిష్యత్‌పై నమ్మకం కలిగించే ల‌క్ష్యం దిశ‌గా యువ‌గ‌ళం సాగ‌నుంది.

Also Read : Nellore CBN : వైసీపీ అడ్డాలోకి చంద్ర‌బాబు! హాట్‌గా `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` !

యువ‌గ‌ళం యాత్ర‌ను ప్ర‌క‌టించిన త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ ట్రోల్స్ మొద‌లు పెట్టింది. పాద‌యాత్ర‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం సిద్దంగా ఉందా? అనే ప్ర‌శ్నలు కూడా వాటిల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. రాబోవు రోజుల్లో పాద‌యాత్ర‌కు పోలీసుల భ‌ద్ర‌త‌ను కోరుతూ టీడీపీ లేఖ‌ను రానుంది. పోలీసులు అనుమ‌తి తీసుకోనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప్ర‌క్రియ మొద‌లు కాలేదు. గ‌తంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేసిన‌ప్పడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. అలాగే, ఇప్పుడు వైసీపీ స‌ర్కార్ లోకేష్ పాద‌యాత్ర‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తుంద‌న్న న‌మ్మ‌కం టీడీపీ సీనియ‌ర్లలో ఉంది. కానీ, ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమ‌తులు ఇచ్చే ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డంలేదు. ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌ను రేపాయి. ఆ క్ర‌మంలో లోకేష్ పాద‌యాత్ర‌కు అనుమ‌తి క్లియ‌ర్ గా ఉంటుందా? ఆంక్ష‌ల న‌డుమ అనుమ‌తి ఇస్తారా? అనేది చూడాలి.

Also Read : TDP Strategy: తెలంగాణ టీడీపీ దూకుడు.. ‘సెంటిమెంట్’ అస్త్రంగా సింహగర్జనలు!