Site icon HashtagU Telugu

Pawan Kalyan : పాక్‌కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్‌ కల్యాణ్‌

If you speak in favor of Pakistan, you should go to that country: Pawan Kalyan

If you speak in favor of Pakistan, you should go to that country: Pawan Kalyan

Pawan Kalyan : జనసేన ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ..మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.

కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మధుసూదన్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మధుసూదర్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామన్నారు పవన్‌ కల్యాణ్‌. ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా నాశనం చేయాలన్నారు.

హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కాగా, పహల్గాం దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పటినుంచి పాకిస్తాన్ మంత్రులు , నేతలతో పాటు అక్కడి మీడియా కూడా భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత సైన్యానికి వ్యతిరేకంగా పలువురు పాక్ నేతలు, సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో మాజీ పేసర్ షోయిబ్ అక్తర్ చానెల్ కూడా ఉంది.

Read Also: Pak Army : నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాక్ ఆర్మీ