నారా లోకేష్ (Nara Lokesh) మాట ఇచ్చాడంటే..దేవుడు వరం ఇచ్చినట్లే అని ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు లోకేష్ ఎప్పుడు ముందుంటారు. కేవలం రాజకీయాలే కాదు సోషల్ మీడియా లో కూడా లోకేష్ నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఆపదలో ఉన్న వెంటనే రియాక్ట్ అవుతూ వారిని కాపాడుతుంటారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మందిని కాపాడడం , వారికీ ఆర్ధిక సాయం చేయడం చేసారు. తాజాగా మరో మహిళకు సాయం చేసి ఆ కుటుంబంలో ఆనందం నింపారు లోకేష్.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్‌కు చెందిన యల్లంపల్లి లక్ష్మి ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ చిత్రహింసలు అనుభవిస్తుంది. స్థానిక ఏజెంట్ సహకారంతో ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె అక్కడ యజమానుల వేధింపులు, చిత్రహింసలకు గురయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన కుటుంబానికి సమస్యను తెలియజేసి రక్షణ కోసం అభ్యర్థించింది. బాధితురాలి పరిస్థితిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక టీటీడీ నేతకు సమాచారం అందించారు. ఈ సమాచారం ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు విషయం చేరగా, ఆయన వెంటనే స్పందించారు. ఎంబసీ అధికారులతో కలిసి ఆమెను రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తన ప్రత్యేక టీమ్ ద్వారా బాధితురాలి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆమెను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు.
లోకేష్ చొరవతో లక్ష్మి చివరకు భారత్‌కు తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులను కలుసుకుంది. లక్ష్మి స్వస్థలానికి చేరడంతో ఆమె కుటుంబం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాలలో చిక్కుకున్న ఎంతో మంది భారతీయులను రక్షించడంలో లోకేశ్ చేసిన కృషి ప్రశంసనీయమని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25 మందిని స్వస్థలాలకు చేర్చిన మంత్రి లోకేశ్, మానవతా దృక్పథంతో నడుస్తున్న నేతగా నిరూపితమయ్యారు.
Read Also : Look Back 2024 : జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చిన 2024