అధికారం లో ఉన్నప్పుడు ఆడిందే ఆట..పాడిందే పాట..ఎన్ని తప్పులు చేసిన..ఎంత అవినీతికి పాల్పడిన ఏమీకాదు..ఒన్స్ అధికారం కోల్పోయామో..అంతే సంగతి జైలు జీవితం గడపాల్సిందే. అధికారం చేతిలో ఉండడం తో అన్ని శాఖల అధికారులు చెప్పుచేతిలో ఉంటారు..అప్పుడు ఏమీకాదు…ఒకవేళ ఖర్మకాలి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందా..అంతే సంగతి. ప్రస్తుతం దేశంలో ఇలాగే జరుగుతుంది..అధికార కోల్పోయిన నేతలే కాదు అధికారంలో ఉన్న వారు సైతం అంతే ఎందుకు సీఎం లు సైతం అరెస్ట్ కావాల్సి వస్తుంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం తో దేశ వ్యాప్తంగా చర్చగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఒకప్పుడు అవినీతి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్, ఇప్పుడు అదే అవినీతి అరోపణలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం ఫై అంత మాట్లాడుకుంటూ..గతంలో పలు అవినీతి కేసుల్లో (Corruption Cases) అరెస్ట్ అయినా..సీఎం (CM) లు , మాజీ (EX CM) సీఎంల గురించి కూడా ఆరా తీస్తూ..చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ (Jagan) గురించి కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అధికారంలో ఉండి ..అదికూడా సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసారంటే..ఎన్నో కేసుల్లో ..జైలు జీవితం సైతం గడిపి బెయిల్ ఫై బయటకు వచ్చి సీఎం అయినా జగన్ ను ఎందుకు వదిలిపెడతారని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ ను సీఎం పదవే కాపాడుతుందని..అది కూడా కేంద్రం లో ఉన్న బిజెపి తో జగన్ సాన్నిహిత్యంగా ఉండడం..తన పార్టీ ఎంపీలు సైతం కేంద్రంకు సపోర్ట్ చేస్తూ ఉండడం తో జగన్ ను చూసి..చూడనట్లు కేంద్రం ఉందని..కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఒకవేళ ఖర్మకాలి వైసీపీ ఓడిపోతే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టీడీపీ – జనసేన – బిజెపి కూటమిగా బరిలోకి దిగుతుంది. ఒకవేళ కూటమి గెలిస్తే మాత్రం జగన్ ను జైల్లో వేస్తారని మాట్లాడుకుంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా..?