ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సంబదించిన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయాయ్యి. ఇప్పటీకే అధికార పార్టీ వరుసపెట్టి జాబితాలను విడుదల చేస్తుండగా..ఈరోజు శనివారం టీడీపీ (TDP) ఏకంగా 94 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే జనసేన (Janasena) ఐదు స్థానాలకు సంబదించిన పేర్లను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది.
మొదటి జాబితా విడుదల (TDP-Janasena First List) అనంతరం మీడియా తో చంద్రబాబు మాట్లాడారు. జనసేనతో సీట్ల షేరింగ్ విషయంలో తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత కష్టపడినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ‘రెండు పార్టీలు కలిసి పనిచేయాలనుకోవడం మంచి ప్రయత్నానికి తొలి అడుగు. పొత్తు కోసం చాలా కష్టపడ్డాను. 1.10 కోట్లమంది నుంచి అభిప్రాయాలను సేకరించాం. అనేక సోర్సెస్ ద్వారా సరైన సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే ఈ 94మందిని ఫైనలైజ్ చేశాను’ అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా వైసీపీ అధిష్టానం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రౌడీలను, గూండాలను వైసీపీ అభ్యర్థులుగా నిలబెడుతోందని విమర్శించారు. ‘క్యాండిడేట్లుగా ఎర్రచందనం స్మగ్లర్లను కూడా వైసీపీ పెట్టింది. జనసేన, టీడీపీ బాధ్యతాయుతమైన అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. అందరికీ సీట్లు రాకపోవచ్చు. టీడీపీ పోటీ చేసే చోట జనసేన, జనసేన పోటీ చేసే చోట టీడీపీ సహకరించాలి. కలిసి పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది’ అని పేర్కొన్నారు. తమ కూటమి వద్ద డబ్బు లేకపోయినా ప్రజాబలం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయమే చేశాం. అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి డబ్బు ఖర్చుపెట్టి తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ప్రజలు ఓవైపు ఉంటే, అహంభావంతో కూడిన వైసీపీ మరోవైపు ఉంది. అందరూ ఆలోచించాలి. మా పని మేం చేస్తాం. మీ పని మీరు చేయండి. కూటమి ఏర్పాటుతో మా గెలుపు ఖాయమని వైసీపీకి అర్థమైంది’ అని ధీమా వ్యక్తం చేసారు.
Read Also : Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..