నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati ChandraSekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొడుకును తానేనంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తనకు కొడుకులు ఎవరూ లేరని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తనను కుమారుడిగా ఒప్పుకోవాలంటూ మేకపాటి శివచరణ్‌రెడ్డి రాసిన బహిరంగ లేఖపై ఆయన వివరణ ఇచ్చారు. మొదటి భార్య తులసమ్మకు పుట్టిన రచనారెడ్డి, రెండోభార్య శాంతమ్మకు పుట్టిన సాయి ప్రేమితారెడ్డి మాత్రమే తన రాజకీయ వారసులని చెప్పారు. డబ్బుల కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే చంద్రశేఖర్ రెడ్డి వీడియోపై శివచరణ్ రెడ్డి స్పందించారు. తన ఊరులో ఎవరినీ అడిగినా వాస్తవం చెబుతారని అన్నారు. తన సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఉందని తెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రశేఖర్ రెడ్డి తనపై వచ్చిన కథనాలను ఖండించారు. తనకు ఇద్దరు భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన ఇద్దరు ఆడ బిడ్డలని వారే తన వారసులని ప్రకటించారు. తనకు మగపిల్లలు ఎవరూ లేరని చెప్పారు. శివచరణ్‌రెడ్డికి తాను తండ్రిని కాదన్నారు. శివచరణ్‌రెడ్డి అమ్మ భర్త వెంకటకొండారెడ్డి అని అన్నారు.
Also Read: Kamareddy MLA: మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత.. ఏమన్నారంటే..?
శివచరణ్ రెడ్డికి వెంకటకొండారెడ్డి తండ్రి అని, డబ్బుల కోసమే తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కొవాలంటే నేరుగా రావాలని సవాలు విసిరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకుని తానేనంటూ శివచరణ్ రెడ్డి స్పష్టం చేశాడు. తనకు కుమారులు లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శివచరణ్ రెడ్డి స్పందించారు. తనకు ఆస్తులు, రాజకీయ వారసత్వం వద్దని నిజం ఒప్పుకుంటే చాలన్నారు.