Hyderabad city Civil court : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సిటి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పిటిషనర్ రామరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సిటీ కోర్టు సోమవారం పవన్‌కు నోటీసులు జారీ చేసింది.
కాగా, అయోధ్య రామాలయంలో రాముడి పున ప్రతిష్టకు కల్తీ లడ్డూలు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ కు కూడా సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంపై పవన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియా నుంచి, మీడియా చానల్స్ నుంచి తొలగించేలా ఆదేశివ్వాలని పిటిషనర్ రామారావు కోర్టును కోరారు.