Site icon HashtagU Telugu

AP Liquor Policy : ఏపీ మద్యం టెండర్లలో భారీ కుంభకోణం – మాజీ మంత్రి అమర్ నాధ్

Ap Liquor Tenders

Ap Liquor Tenders

ఏపీ(AP)లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..రాష్ట్రంలో మళ్లీ పాత బ్రాండ్స్ (Liquor) ను అందుబాటులోకి తీసుకొచ్చి మందుబాబుల్లో ఆనందం నింపింది. రాష్ట్రంలో నేటినుండి కొత్త మద్యం పాలసీ (AP Liquor Policy) అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం షాపులు లేకుండా… రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక 2019కి ముందు ఉన్న మద్యం బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి రావడం తో మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ లాంటి బ్రాండ్లను చూసి మందుబాబుల సంబరాలు అన్నీఇన్నీ కావు.

ఇదిలా ఉంటె మద్యం టెండర్లలో భారీ కుంభకోణం (huge scam in AP liquor tenders) జరిగిందంటూ మాజీ మంత్రి అమర్ నాధ్ (ex minister amar nandh) కీలక ఆరోపణలు చేసారు. ఎన్నికల్లో సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ఇప్పుడు తాము మాత్రమే సంపద సృష్టించుకుంటామనే రీతిలో ఉన్నారని ఆరోపించారు. మద్యం టెండర్లలో కూటమి నాయకులకే వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, టిడిపి నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ తీసుకువచ్చారు. ఆ క్రమంలోనే వైన్‌షాప్‌ల కేటాయింపు జరిగింది’ అని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశామని.. 4,500 వైన్‌షాప్‌లు ఉంటే 2,900కి తగ్గించమని , మద్యం దుకాణాలు తగ్గించి పేద కుటుంబాలను రక్షించి వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని , నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. ‘రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్‌ ఉంటుంది. ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారు’ అని ఎద్దేవా చేసారు. ఇదిలా ఉంటె కొత్త మద్యం విధానంలో దుకాణాలు దక్కించుకున్న వారిని అపహరించడం.. బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.

Read Also : IAS Officers Vs CAT : ‘క్యాట్‌’ తీర్పు‌పై హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్.. కాసేపట్లో విచారణ