Budameru Floods Effect : చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపాలు చేసిన బుడమేరు

Budameru Vagu Floods Effect : బుడమేరు కన్నెర్ర చెయ్యడం తోనే ఈ కాలనీ లు అన్ని నీట మునిగాయి. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం... ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది.

Published By: HashtagU Telugu Desk
Huge Loss To Small Business

Huge Loss To Small Business

Budameru Floods Effect పది రోజుల క్రితం ఎడతెరపిలేని వర్షం విజయవాడ (Vijayawada ) నగరాన్ని జలమయం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఒకే రోజు 29 సెం,మీ వర్షం పడేసరికి వన్​టౌన్​, గురునానక్​ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్​, బందర్​ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్​ సర్కిల్​ , ఏపీఐఐసీ కాలనీ రోడ్డు , మొగల్రాజపురంలో పాలి క్లినిక్​ రోడ్డు , పాతబస్తీ పంజా సెంటర్, మినార్​ మసీదు, సింగ్​నగర్​ తదితర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధానంగా బుడమేరు కన్నెర్ర (Budameru Vagu Floods Effect) చెయ్యడం తోనే ఈ కాలనీ లు అన్ని నీట మునిగాయి. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం… ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ముఖ్యంగా సింగ్​నగర్​లో ప్రాణ , ఆస్తినష్టం ఎక్కువగా జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ కాలనీ జనాలు బయటకు వస్తున్నారు.

బుడమేరు కన్నెర్ర చెయ్యడం తో చిరు వ్యాపారుల బతుకులు రోడ్డు పాలయ్యాయి. కిరానా షాప్స్ , ఫర్నిచర్ షాపులు, లామినేషన్ షాపులు, ఫోటో స్టూడియోలు, బియ్యం షాప్స్, ప్లేవుడ్, కప్ బోర్డులు అమర్చే షాప్స్ , హార్డ్ వేర్ , పాన్ షాప్స్ ఇలా ఒకటేమిటి చిరు వ్యాపారాలన్నీ వరద దెబ్బకు అతలాకుతలమయ్యాయి. నాల్గు రోజుల పాటు వరద నీటిలో వస్తువులు నానిపోవడం తో అవి పనికిరాకుండా అయిపోయాయి. వరద పెరుగుతుండడం తో షాప్స్ లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో వస్తువులన్నీ పాడైపోయాయి. వరద నీటికి నానిపోయి వస్తువులు, పుస్తకాలు చివికిపోయాయి. అజిత్ సింగ్ నగర్, పైపుల రోడ్డు, ప్రకాశ్ నగర్, కండ్రిగ, పాయకాపురం, వాంబే కాలనీ, శాంతినగర్, స్వాతి సెంటర్, సితార సెంటర్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

తడిసిపోయిన, నానిపోయిన పరికరాలను, మిషన్లు చూసి వారు కన్నీరుపెట్టుకుంటున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకొని వ్యాపారాలు చేస్తుంటే ఈ వరదలు తమను రోడ్డు మీదకు తీసుకొచ్చాయని..మళ్లీ మీము మొదటికి వచ్చామని..తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో..ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 లక్షల వరకు నష్టపోయారు. అసలే నెలవారీ రుణ వాయిదాలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తమకు వరద పోటు జీవన్మరణ సమస్యగా మారిందని వాపోతున్నారు. తమతో పాటు దుకాణాల్లో పని చేసే కూలీల పరిస్థితి అయోమయంగా మారిందని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Read Also : Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?

  Last Updated: 11 Sep 2024, 12:22 PM IST