కడపలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు(Mahanadu)లో తొలి రోజే విరాళాల (Donations) వర్షం కురిసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) వెల్లడించిన వివరాల ప్రకారం తొలి రోజు రూ.21.53 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని చెబుతూ, ప్రతి ఒక్కరు తమ శక్తిమేరకు సహకరించాలని ఆయన కోరారు. ఆన్‌లైన్ ద్వారా కూడా విరాళాలు పంపొచ్చని పేర్కొంటూ, పార్టీ ఖర్చులకు, మిగిలిన మొత్తాన్ని కార్యకర్తల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు.
Rishabh Pant: ఐపీఎల్‌లో 7 సంవత్సరాల తర్వాత పంత్ సెంచరీ.. వీడియో వైరల్!
ఈ సందర్బంగా పలువురు నాయకులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5 కోట్లు విరాళంగా ఇస్తూ టాప్‌లో నిలిచారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.5 కోట్లు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ రూ.1.16 కోట్లు విరాళం ఇచ్చారు. మంత్రులు, ఎంపీలు, నేతలు ఇలా ఒకరి తర్వాత మరొకరు విశేషంగా సహకరించారు. పి.నారాయణ, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ తదితరులు ఒక్కొక్కరు రూ. కోటి చొప్పున విరాళం అందించారు. మరికొంతమంది రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.10 లక్షల చొప్పున సహకరించారు.
మహానాడు వేదికగా పార్టీ నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు ప్రతిపాదించారు. కుటుంబ సాధికార సారథులు (KSS), క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ (CUBS) ఇన్‌ఛార్జిల పదవులకు చట్టబద్ధత కల్పించేలా 5వ అధికరణంలో సవరణలు చేయాలన్నారు. పార్టీ నియమావళిలో ఈ మార్పులను పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించాలన్న ఆయన, కార్యకర్తల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని మార్పులు అవసరమని స్పష్టం చేశారు. 2021లో జిల్లా కమిటీ స్థానంలో పార్లమెంట్ కమిటీలను తీసుకురావడం వంటి మార్పులే ఇందుకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు.