Site icon HashtagU Telugu

Chandrababu: కుప్పంలో CBN ఇంటి నిర్మాణానికి హుడా పర్మిషన్

Chandrababu

New Web Story Copy (12)

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజవర్గంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. చంద్రబాబు ఎప్పటినుంచో కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు అక్కడ సొంత ఇల్లు లేకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. సొంత నియోజక వర్గంలో నివాసం ఉండని నాయకుడు ప్రజల అవసరాలు ఎలా తెలుసుకుంటారన్న విమర్శలు అయితే ఆయన ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ లో ఉంటూ తన రాజకీయ అవసరం మేరకే ఆంధ్రప్రదేశ్ కు వస్తారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు కుప్పంలో ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్నెల్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం ప్రాంతంలో జాతీయ రహదారిని అనుకుని 99.77 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు అనుమతులు మంజూరయ్యాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పీఎంకే హుడా అనుమతులు జారీ చేసింది.

Also Read: England: 36 ఏళ్లుగా అతనిని తండ్రి అనుకున్న యువతి.. తీరా తల్లి మాటలు విని షాక్?