AP Elections : జగన్‌పై 26 మంది.. చంద్రబాబుపై 12 మంది.. షర్మిలపై 13 మంది పోటీ

అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 318 మంది, లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 49మంది వాటిని ఉపసంహరించుకున్నారు. 

  • Written By:
  • Updated On - May 1, 2024 / 08:11 AM IST

AP Elections : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు నిలిచారు ? అనే వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.  నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 454 మంది అభ్యర్థులు,  175 అసెంబ్లీ స్థానాల్లో  2,387 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలిపింది. మే 13 న జరగనున్న ఎన్నికల్లో వీరంతా పోటీ పడతారని పేర్కొంది. అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 318 మంది, లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 49మంది వాటిని ఉపసంహరించుకున్నారు.  ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

We’re now on WhatsApp. Click to Join

చంద్రబాబు, జగన్ పోటీ చేసే స్థానాల్లో.. 

  • తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు(AP Elections) బరిలో ఉన్నారు.
  • అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి అత్యల్పంగా ఆరుగురే పోటీలో ఉన్నారు.
  • పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం జగన్ సహా 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
  • కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది పోటీ ఉన్నారు.
  • మంగళగిరిలో నారా లోకేశ్ సహా 40 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
  • పిఠాపురం అసెంబ్లీ బరిలో జనసేనాని పవన్ కల్యాణ్ సహా 13 మంది పోటీలో ఉన్నారు.

Also Read :Manipur Cops : మహిళలను అల్లరిమూకలకు అప్పగించింది పోలీసులే : సీబీఐ

  • కడప లోక్ సభ స్థానంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సహా 14 మంది బరిలో ఉన్నారు.
  • నంద్యాల లోక్‌సభ స్థానంలో  31 మంది, గుంటూరు లోక్‌సభ స్థానంలో 30 మంది పోటీలో ఉన్నారు.
  • అత్యధికంగా విశాఖ పార్లమెంటు స్థానం నుంచి  33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
  • రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి అత్యల్పంగా 12 మంది అభ్యర్థులే పోటీ చేస్తున్నారు.

Also Read :Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్