Site icon HashtagU Telugu

Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన

Bala Veeranjaneya Swamy

Bala Veeranjaneya Swamy

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు (Houses ) అందించేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల భూమి, పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ హామీని ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించినప్పటి నుంచే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ హామీని అమలు చేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అన్ని అర్హతా ప్రమాణాలను స్పష్టంగా వివరించి, ప్రతి అర్హునికి ఇళ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

TTD : సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ సమావేశం

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Bala Veeranjaneya Swamy) తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిగా స్థగించబడినప్పటికీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. అలాగే మే నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు.

గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌లో భారీ దుర్వినియోగం జరిపిందని , ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి భంగం కలిగిందని, నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, ఇదే అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్లాలని సంకల్పించినట్లు తెలిపారు.