Hindustan Coca-Cola : భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి ), తమ సమగ్ర సిఎస్ఆర్ విధానం, ప్రాజెక్ట్ షైన్ (SHINE) లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి మరియు అనంతపురం జిల్లాల్లో పలు కమ్యూనిటీ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలలో నీటి ఏటిఎం, రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ ) ఫిల్టర్‌లు, కొత్త టాయిలెట్ సౌకర్యాలు మరియు సమగ్ర నీటి లభ్యత , పారిశుధ్యం మరియు పరిశుభ్రత (వాష్) కార్యక్రమం ఏర్పాటు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్‌సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
Read Also: Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం
ప్రాజెక్ట్ షైన్‌లో భాగంగా, హెచ్‌సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్‌లోని శివంపల్లిలో వాటర్ ఏటిఎం ఏర్పాటు చేయబడింది. గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని అందించడం మరియు వారి జీవన నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరంలోని దుర్గానగర్‌లోని ప్రభుత్వ SW బాలికల హాస్టల్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు)లో మూడు ఆర్ఓ ఫిల్టర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంత-నిర్దిష్ట కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన అవసరాలను తీర్చడానికి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి హెచ్‌సిసిబి యొక్క అంకితభావాన్ని వెల్లడి చేస్తాయి.
అదనంగా, తమ నీటి సదుపాయం, పారిశుధ్యం మరియు పరిశుభ్రత (వాష్) కార్యక్రమంలో భాగంగా, హెచ్‌సిసిబి ఆరు ప్రదేశాలలో టాయిలెట్ సౌకర్యాలను నిర్మిస్తోంది. వీటిలో అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ బ్లాక్‌లోని గుంజెపల్లెలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPHS), అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లి గ్రామంలోని ప్రభుత్వ BC కళాశాల బాలుర హాస్టల్ (రెసిడెన్షియల్ కళాశాల) మరియు అనంతపురం జిల్లా ధర్మవరం బ్లాక్‌లోని గొట్లూరులోని జెడ్‌పి హై స్కూల్, అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని ప్రభుత్వ బి.సి. బాలికల హాస్టల్, అనంతపురం జిల్లా మాల్యవంతం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు, పాఠశాలలు మరియు కమ్యూనిటీ లలో వాష్ సెషన్‌లను హెచ్‌సిసిబి నిర్వహిస్తోంది, వ్యక్తిగత పరిశుభ్రత, సరైన రీతిలో చేతులు కడుక్కోవడం, పారిశుద్ధ్య పద్ధతులు, కౌమారదశ మరియు అంటు వ్యాధుల నివారణ వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తోంది.