ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న సమయంలో పలు ఉద్రిక్తత ఘటన చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ – కూటమి వర్గీయులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దీ సేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి బాపులపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అలాగే ముస్తాబాద్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గీయులు ఒకరిపై మరొకరు చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ వారివారి కార్లలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ రోజు కూడా తాడిపత్రిలో వైసీపీ మారణహోమం చూసి ఆవేదన కలుగుతోందని పేర్కొన్నారు. టీడీపీకి అనుకూల ఓటింగ్ పడుతోందని పోలీసులను కూడా కొడుతున్న వీళ్లా మన నేతలు? అంటూ ఆక్రోశించారు. ఇలాంటి ఫ్యాక్షన్ పోకడలను పెంచి పోషిస్తున్న జగన్ కోరలు పీకే సమయం వచ్చింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ అల్లరి మూకలను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమికొడతాం” అని నారా లోకేశ్ హెచ్చరించారు.
ఇక ఈసారి ఏపీలో పోలింగ్ శాతం రికార్డు నమోదు కాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఉదయం 07 నుండే పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం..సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ , టెక్నీకల్ టీమ్ వాటిని సరిచేయడం తో అవి వర్క్ అవుతున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 9 వరకు 9.21 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 1గంట వరకు 40.26శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ శాతం మధ్యాహ్నం 3గంటలకు 55 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదైంది. తర్వాత స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also : YCP MLA House Arrest: వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్ హౌస్ అరెస్ట్