స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది. సీమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌తో సహా ఈ కేసులోని ఇతర నిందితులందరికీ బెయిల్ లభించినందున చంద్రబాబుకు కూడా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. సీఐడీ తరుపున వాదనలు వినిపించేందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరుకాలేకపోతున్నట్లు కోర్టుకు పీపీ తెలిపారు. దీంతో వారం రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. రెగ్యులర్ బెయిల్ కోసం టీడీపీ అధినేత మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగియగా, తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల తర్వాత తీర్పును వెలువరిస్తామని వెల్లడించారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
Also Read: BJP: వేములవాడ బీజేపీ టికెట్ మార్పు, బోరున ఏడ్చేసిన తుల ఉమ