Heavy Rains In AP: గల్ఫ్ ఆఫ్ మన్నార్, పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Heavy Rains In AP) తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం అంటే నేడు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు పడతాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు తాజాగా ఒక ప్రకటన చేశారు. గురువారం ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం చిత్తూరు జిల్లాలో వర్షం దంచికొట్టింది. తిరుమలలో భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
Also Read: Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి అనిత రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తూ కీలక ఆదేశాలు అధికారులకు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించిడంతో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు.