Heavy Rains in AP : ఏపీకి భారీ వర్షాలు తెచ్చిన నష్టాల వివరాలు

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు , వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 32 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది

Published By: HashtagU Telugu Desk
Details Of Losses Caused By

Details Of Losses Caused By

వాయుగుండం ప్రభావం తో ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 29 సెం,మీ వర్షం పడేసరికి నగరం అతలాకుతలం అయ్యింది. ఇదే క్రమంలో బుడమేరు వాగు ఉప్పొంగడం మరింత ప్రాణ , ఆస్థి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడం తో వరద ప్రవాహం తగ్గింది. ఈ క్రమంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాలను ప్రభుత్వం అధికారులను అడిగితెలుసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు , వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 32 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక 1,69,370 ఎకరాల్లో వివిధ రకాల పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని , 2.34 లక్షల మంది రైతులు నష్టపోతాయని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల కోళ్లు, 222 పశువులు మృతువాత పడ్డాయని పేర్కొన్నారు. వరదల కారణంగా 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని , 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వెల్లడించారు. 6,44,536 మంది తీవ్రంగా నష్టపోయారని, 193 సహాయ శిబిరాల్లో 42,707 మంది తలదాచుకుంటున్నారని అధికారులు వివరించారు.

Read Also : Gabbar Singh : అప్పులు తీర్చడానికే పవన్ ‘గబ్బర్ సింగ్’ చేసాడట..

  Last Updated: 04 Sep 2024, 11:27 PM IST