Heavy Rains: అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో మరో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Vishwak Sen : నాకు 100 కోట్ల కలెక్షన్ కాదు.. 100 కోట్ల రెమ్యునరేషన్ రావాలి.. విశ్వక్ సేన్ కామెంట్స్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం (నవంబర్ 11) అంచనా వేసిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ ప్రకారం.. నవంబర్ 15 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
నైరుతి బంగాళాఖాతం నుండి NCAP నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి తక్కువగా గుర్తించబడిందని కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా ఏపీ రాజధాని అమరావతిలోని తాడేపల్లి, ఇతర ప్రాంతాల్లో మంగళవారం మేఘావృతమైన వాతావరణంతో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధ తుఫాను ప్రసరణ ఇప్పుడు సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతవారణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.