Site icon HashtagU Telugu

Rain Alert: రానున్న మూడు రోజుల్లో ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు

Rain Alert

New Web Story Copy (11)

Rain Alert: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపి లేకుండా వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీలో భారీ వర్ష ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షం దంచికొడుతుంది. వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ కూడా జారీ అయింది. మరోవైపు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. ఇక ప్రయివేట్ సంస్థలకు సైతం శనివారం హాలిడే ప్రకటించారు. కొన్ని సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ కు ఆదేశించాయి. ఇదిలా ఉండగా ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ బాంబ్ పేల్చింది.

ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25 నుంచి 27 వరకు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. వచ్చే మూడు నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.

Also Read: England: 36 ఏళ్లుగా అతనిని తండ్రి అనుకున్న యువతి.. తీరా తల్లి మాటలు విని షాక్?