Heavy Rain : శ్రీశైలంలో భారీ వర్షం…రోడ్ ఫై పడిన కొండచరియలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది

Published By: HashtagU Telugu Desk
Heavy Rain In Srisailam

Heavy Rain In Srisailam

శ్రీశైలం (Srisailam )లో గత రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడంతో కొండచరియలు విరిగి రోడ్ ఫై పడ్డాయి. దీంతో భక్తులు , ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాల్గు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలం ప్రాంతంలోని పాతాళగంగకి వెళ్లే మెట్ల దారికూడా వర్షం నీటితో నిండుకుపోయింది. లలితాంభిక షాపింగ్ కాంప్లెక్స్ లోకి పెద్దఎత్తున నీరు చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

కొత్తపేట శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నల్లమల్ల అటవీ ప్రాంతం ఆనుకొని ఉన్న కాలనీలో వర్షపు నీరు అధికంగా రావడంతో కాలనీలు జలమయం అయ్యాయి. ఇక జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. రాత్రి సమయం కావడం, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపైకి పెద్దపెద్ద బండరాళ్లు పడిపోవటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Read Also : KTR Farmhouse : జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ హైకోర్టులో పిటిషన్…

  Last Updated: 21 Aug 2024, 12:06 PM IST